టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప ఫ్రాంచైజ్ హిట్లతో నేషనల్ లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2తో ఏకంగా రూ.1800 కోట్లు కొల్లగొట్టి సాలిడ్ సక్సస్‌ను ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తన నెక్స్ట్ సినిమా విషయంలో బన్నీ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని.. ఫ్యాన్స్‌ను అసలు డిసపాయింట్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికే ఎంతో మంది పేర్లు వైరల్ గా మారాయి.
వారిలో త్రివిక్రమ్, అట్లీ పేర్లు ఎక్కువగా వినిపించాయి. అయితే త్రివిక్రమ్ – అల్లుఅర్జున్ కోసం ఓ మైథలాజికల్ స్టోరీ ని ప్లాన్ చేస్తున్నాడని.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు వార్తలు వినిపించాయి. కానీ.. స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ తాజాగా చేసిన కామెంట్స్ తో ఈ ప్రాజెక్టు ఇప్పట్లో ఉండదని క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్.. అట్లీ డైరెక్షన్ లో నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే పుష్ప 2తో దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా మారిపోయిన బన్నీ.. ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం.. ఏకంగా రూ.175 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు.. లాభాల్లో 15% వాటాను ఇచ్చేలా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడట. అయితే.. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యస్ వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక అక్టోబర్ నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కానుందని.. మేకర్స్ ఇప్పటికే అన్ని సిద్ధం చేసినట్లు సమాచారం.