టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్, ప్రెస్టేజియస్ మూవీ SSMB 29. రాజమౌళి డైరెక్షన్‌లో.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో.. ఎప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయా అంటూ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇది మహేష్ కెరీర్‌లోనే కాదు.. రాజమౌళి కెరీర్‌లో కూడా అత్యంత భారీ బడ్జెట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో మెరువనున్నారు.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ నార్త్ లోని ఒడిశా రాష్ట్రంలో అవుట్ డోర్ స్కెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఆ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోస్, ఫొటోస్ ఇప్పటికీ వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన.. మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన L2 ఎంపురాన్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. SSMB 29 గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో బాలీవుడ్ మీడియాతో ముచ్చటించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇందులో మీరు SSMB 29లో రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమా షూట్ ఎలా జరుగుతుంది అని ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాన్ని వెల్లడించాడు.
పృధ్వీరాజ్ రియాక్ట్ అవుతూ అవునా.. నిజమా.. నేను, మహేష్ కలిసి జస్ట్ సైడ్ సీయింగ్ కోసం వెళ్థాం అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇక ఒక సంవత్సర కాలంగా సినిమాపై వర్క్ జరుగుతుందని.. అలాగే మాస్టర్ క్లాస్ సినిమా త్వరలో రాబోతుందంటూ వివరించాడు. ఇంతకుమించి ఏమీ మాట్లాడలేను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోని పృథ్వీరాజ్ కామెంట్స్ నెటింట వైరల్ అవడంతో రాజమౌళి సినిమా అంటే అంతే ఉంటుంది. ఆయన అనుమతి లేకుండా మాటమాట్లాడాలి అన్న స్టార్స్ సైతం భయపడాల్సిందే. రాజమౌళి కండిషన్స్ అలా ఉంటాయి మరీ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.