టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటిన పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలవిషయంలో స్పీడ్ బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కేవలం డిప్యూటీ సీఎం గానే కాక.. ఐదు శాఖల మంత్రిగాను కొనసాగుతున్న పవన్.. రాజకీయాల్లో పూర్తిగా బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోని ఆయన కమిటైన సినిమాలను సైతం పూర్తిచేయాలని పరిస్థితి నెలకొంది. దీంతో పవన్ ఈ మూవీస్ తర్వాత.. ఇక తెరపై కనిపించడమే కష్టం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సెన్సేషనల్ గా మారాయి. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో నాగవంశీ.. పవన్ సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేశారు. పవన్ గారు ప్రస్తుతం సినిమాలు చేయాలని కోరుకోవడం కంటే.. ఆయన రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తారని మనం ఆశించాలి.. ఏం చేస్తున్నారని ఆలోచించాలి.. ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకోవాలి అంటూ కామెంట్స్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలకు కమిటీ అయినా సంగతి తెలిసిందే.
అలా తను నటించిన సినిమాల్లో హరిహర వీరమల్లు ఆల్మోస్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా మే 9న రిలీజ్ చేయనున్నటు టాక్. సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించిన మరో సినిమా ఓజి. ఇప్పటికే ఈ సినిమా 80% షూటింగ్ ముగిసిందట. ఉస్తాద్ భగత్ సింగ్ కొన్ని ముఖ్యమైన షెడ్యూల్ ను పూర్తి చేయాల్సి ఉంది. ఇలా పవన్ మూడు సినిమాలు పూర్తి చేసి.. స్క్రీన్ పై మెరిస్తే చాలు.. ఆడియన్స్ కు పండగల ఉంటుందనటంలో సందేహం లేదు. ఇక పవన్ నెక్స్ట్ సినిమాలకు కమిట్ అవుతారా.. లేదా.. ఇంతటితో సినిమాలకు స్వస్తి చెబుతారా అనేది కూడా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపై పూర్తి స్థాయిలో పొలిటిషన్ గా రాజకీయాలపై పవన్ దృష్టి సారిస్తారని సమాచారం.