స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గణేష్ ఆచార్య తాజాగా యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలను అల్లు అర్జున్‌తో కంపేర్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. గణేష్ ఆచార్య పుష్ప రెండు పార్ట్‌లకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఆయన డిజైన్ చేసిన స్టెప్స్ సోషల్ మీడియాను షేక్ చేసి పడేశాయి.
స్టార్ సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం ఆ స్టెప్పులు వేస్తూ తెగ హైలెట్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గణేష్ ఆచార్య మాట్లాడుతూ.. బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలో టెక్నీషియన్లకు చక్కగా గౌరవం, మంచి ప్రేమ దక్కుతాయి అంటూ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ లో మూవీ హిట్ అయితే.. కేవలం డైరెక్టర్, హీరోలకు ప్రశంసలు దక్కుతాయని.. కొరియోగ్రాఫర్ ఎవరన్నది కూడా పట్టించుకోరని.. కానీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప పాటలు హిట్ అయితే.. నన్ను స్పెషల్గా ఇంటికి పిలిచి మరి ప్రశంసించారు సత్కరించారు అంటూ చెప్పుకొచ్చాడు.
సార్ మీ వల్లే పాటలు ఇంత పెద్ద హిట్ అయ్యాయని చెప్పడంతో.. నా హృదయం ఉప్పొంగిపోయిందని.. నాకది చాలంటూ చెప్పుకొచ్చాడు గణేష్ ఆచార్య. పుష్ప సిరీస్ అయిపోయాక నన్ను పార్టీకి బన్నీ ఆహ్వానించారని ఆ పార్టీలో అందరూ టెక్నీషియన్లను పిలిచి అవార్డులతో గౌరవించారంటూ చెప్పుకొచ్చాడు. కానీ.. బాలీవుడ్లో అల్లు అర్జున్ లాంటి హీరోలు ఒక్కరు కూడా లేరని.. ఎంత కష్టపడ్డా సరే ఎవ్వరు కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదని.. లాస్ట్ మినిట్‌లో కూడా హీరోలు స్టెప్పులు చేంజ్ చేయమంటారని.. మా కష్టం గురించి ఆలోచించరంటూ చెప్పుకొచ్చాడు.
సౌత్ ఇండియా హీరోలకు షూట్ కు వెళ్ళకముందే ఒకసారి రిహార్సెల్ స్టెప్స్ చూపిస్తాం. వాళ్ళు ఓకే అంటే అదే ఫైనల్ అయిపోతుంది. మళ్లీ చేంజ్ చేయమని అస్సలు చెప్పరంటూ గణేష్ ఆచార్య వివరించాడు. ప్రస్తుతం గణేశ ఆచార్య చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో.. అందరు బన్నీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఓపెన్ గా ఎలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడానికి చాలా గట్స్ ఉండాలని.. గణేష్ ఆచార్య నిజంగా చాలా గ్రేట్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.