ఇండియన్ క్రికెట్ లవర్స్ అంతా ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక మొట్టమొదటి మ్యాచ్ కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జోరుగా సాగింది. ఇక ఐపీఎల్‌ను కేవలం క్రికెట్ లవర్స్ మాత్రమే కాదు.. అన్ని రంగాల వారు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఆటతో పాటు.. అందం కూడా తోడైందంటే ఇక ఆ కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక ఐపీఎల్ అంటే ఎప్పుడు చూసినా ప్రీతిజింతా, కావ్య మారన్ పేర్లు మాత్రమే వినిపించాయి. కానీ.. ఇప్పుడు ” జాహ్నవి మెహతా ” పేరు ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరోకాదు స్టార్ నటి జుహీ చావ్లా, బిగెస్ట్ బిజినెస్ మ్యాన్ జయ్ మెహతా దంపతుల ముద్దుల కూతురు.
24 ఏళ్ల వయసులోనే ఐపిఎల్ వేలం పాటతో సహా.. ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరిలోనూ హైలైట్ గా మారింది. ముఖ్యంగా.. తండ్రి సహా యాజమాన్యంలోని కోల్కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లో ఎక్కువగా సందడి చేస్తుంది. 2025 వేలానికి హాజరై జట్టుతో పాటు తన సంబంధాన్ని కేకేఆర్ కార్యకలాపాలలో నిర్వహణలో ఆమె పాత్రను మరింత స్ట్రాంగ్ చేసింది. ఇక జాహ్నవికి కేవలం క్రికెట్ అంటే వ్యాపారం మాత్రమే కాదని చాలా ఇష్టమైన తెలుస్తుంది. ఈ కారణంగానే ఈమె కేకేఆర్ జట్టును ఫాలో అవుతుంది. ఇక జాహ్నవి స్కూలింగ్ అంత ఇంగ్లాంట్లో పూర్తి చేసుకుంది. ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది.
కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన జాహ్నవి.. వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా రాణిస్తుంది. ఈమె ఆస్తి ఏకంగా నాలుగు వేల కోట్లకు పైగానే అని సమాచారం. ఇక నాన్న జయ్ మెహతా, మామ నాన్జీ కాళిదాసు స్థాపించిన మెహతా గ్రూప్స్‌కు చైర్మన్ గాను విధులు నిర్వర్తిస్తుంది. ఈ సంస్థ ప్యాకేజింగ్, హార్టికల్చర్, సిమెంట్, నిర్మాణ సామాగ్రి లాంటి వివిధ రంగాల్లో దూసుకుపోతుంది. మెహతా గ్రూప్ ఒక భారతదేశం మాత్రమే కాదు.. కెనడా, యుగాండా, యునైటెడ్ స్టేట్స్ లాంటి దేశాల్లోనూ విస్తరించి ఉండటంతో.. గణనీయమైన అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక జుహీ చావంలా వరల్డ్ లోనే రిచెస్ట్ హీరోయిన్ గా ఉన్న సంగతి తెలిసిందే.