టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గాను క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. నెక్స్ట్ సినిమా అట్లీతో ఉండబోతుందని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఈ సినిమా కోసం ఏకంగా బన్నీ రూ.175 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నాడట. అలాగే ప్రొడక్షన్ బ్యానర్స్ సన్ పిక్చర్స్.. లాభాలలో 15% బన్నీ తీసుకోబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇక ప్రస్తుతం బన్నీ దుబాయ్‌లో ఉన్నారు. అట్లితో తీయబోయ్యే సినిమాకు సంబంధించిన చర్చలు అక్కడే జరుగుతున్నాయని.. ఇక బన్నీ ఇండియాకు తిరిగి రాగానే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రాబోతుందంటూ సమాచారం.
ఇలాంటి క్రమంలో బన్నీ – అట్లి సినిమాకు సంబంధించి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్‌లో నటించనున్నాడని టాక్. అంతేకాదు.. ఈ సినిమాలో ఉండే ఓ ట్విస్ట్‌కు ఆడియన్స్ కు దిమ్మతిరిగి పోతుందటజ ఇంతకీ అదేంటంటే.. బన్నీ ఈ సినిమాలో నటించనున్న డ్యూయల్ పాత్రలో.. ఒకటి పూర్తిగా నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడని.. దాదాపు విలన్ సమానమైన రోల్ లో నటిస్తున్నాడని సమాచారం. అంటే ఈ సినిమాలో.. హీరోగా, విలన్ గాను రెండు పాత్రలో బన్నీనే సత్తా చాటుకోనున్నాడట.
ఇక ఈ తరహా పాత్ర చేయడం స్టార్ హీరోలకు గొప్ప ఛాలెంజ్ అనుకోవాలి. కాగా చివరిగా సాలిడ్ హిట్ అందుకున్న బన్నీ.. పుష్ప సినిమాలోని కాస్త మేరా నెగటివ్ షేడ్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే.. నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్ తో పాటు.. లైట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా చూపించాలని.. ఆ పాత్ర కూడా చాలా ఎఫెక్టీవ్‌గా ఉండాలని.. అట్లీ పగడ్బందీగా ప్లాన్ చేశాడట. ఇక ఈ సినిమాతో పాటే బన్నీ.. త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడని.. దుబాయ్ నుంచి బన్నీ తిరిగి రాగానే.. త్రివిక్రమ్ తో కూడా ఓ మీటింగ్ జరగనుందని.. తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమాపై.. క్లియర్ కట్ క్లారిటీ వస్తుందని టాక్.