నాకు కొంచెం తిక్కుంది.. అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న.. ఎస్. జె. సూర్య

స్టార్ యాక్టర్ కమ్‌ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఎస్. జె. సూర్యకు సౌత్ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన‌ సూర్య.. ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు.. నాని సరిపోదా శనివారం సినిమాల్లో నెగటివ్ షేడ్స్‌లో నటించిన సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ” వీరా ధీరా సుర ” సినిమాలో పోలీస్‌గా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు సూర్య. చియాన్‌ విక్రమ్ హీరోగా, దుషారా విజయ‌న్ హీరోయిన్గా కనిపించనున్న ఈ సినిమా.. మార్చి 27న గ్రాండ్గా రిలీజ్ కానుంది.

Veera Dheera Sooran: SJ Suryah's first look revealed as cop Tamil Movie,  Music Reviews and News

ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రమోషన్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు టీం. ఇక ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఎస్. జె. సూర్య మాట్లాడుతూ ఖుషి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఖుషి సినిమా డైరెక్షన్ టైంలో ఖుషి మూవీ కాపీ చూసి.. సినిమా చాలా బాగుందని కానీ, బాగోలేదని కానీ ఎవరు రియాక్ట్ అవలేదని.. నేను దాంతో చాలా బాధపడ్డా.. మొదటి రోజు సినిమా రిలీజ్ అయ్యాక కూడా సినిమా గురించి ఎక్కడా ప్రస్తావన లేదు సరికదా.. తమిళ్ వెర్షన్ ఫస్ట్ కాపీని చెన్నైలో ఉదయం థియేటర్లో రిలీజ్ చేశాం. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉండి మరి చూశారు. ఏదో స్మశానంలో ఉన్నట్టు ఎవరు ఎలాంటి స్పందన లేకుండా కనీసం నవ్వు కూడా లేకుండా సినిమాను చూస్తూ ఉన్నారని.. అది అలాగే కంటిన్యూ అయి ఉంటే నేను కచ్చితంగా సూసైడ్ చేసుకునే వాడినంటే చెప్పుకొచ్చాడు.

ఎంద‌కంటే నాకు కాస్త తిక్క ఉందంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. అయితే.. రెండో రోజు నుంచి ఖుషి మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారని.. ఇక మొదటి రోజు వచ్చిన టాక్ లాగే.. రెండో రోజు కూడా సినిమా ఉండుంటే కచ్చితంగా నేను చనిపోయే వాడినంటూ చెప్పుకొచ్చాడు. నా అదృష్టం కొద్ది సినిమా బ్లాక్ బస్టర్ అయిందని సూర్య వివరించాడు. అలాగే.. భవిష్యత్తులో కచ్చితంగా మరోసారి మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. మంచి స్క్రిప్ట్‌ దొరికితే.. తెలుగులో ఓ సినిమా చేయాలని ఉందని సూర్య వివరించారు. నేను తెలుగు స్పైడర్ సినిమాలో నటించా. అలాగే కొన్ని డబ్బింగ్ సినిమాలోను చేశా. ఇక అన్ని సినిమాల్లో.. నాని, వివేకాత్రేయ కాంబోలో తెరకెక్కిన సరిపోదా శనివారంతో నాకు మంచి ఇమేజ్ వచ్చిందంటూ క్లారిటీ ఇచ్చాడు.