టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా ఒకప్పుడు శర్వానంద€్ పేరే వినిపించేది. నాచురల్ స్టార్ నానికి గట్టి పోటీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. అయితే తర్వాత శర్వా మెల్లమెల్లగా ట్రాక్ తప్పుతూ వచ్చాడు. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో తన పంథా మార్చుకుని.. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. దీంతో సక్సెస్ రేట్ తగ్గుతువస్తుంది. ఇక శర్వానంద్ గతంలో కో అంటే కోటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గాను తానే వ్యవహరించాడు. ఇందులో భాగంగానే ఆయన తల్లి సహయం అడిగాడట. ఆమె నగలు తాకట్టు పెట్టి మరి కో అంటే కోటీ సినిమా తీశాడు. కట్ చేస్తే సినిమా ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలోనే అప్పట్లో శర్వా పెట్టిన డబ్బు మొత్తం పోయి.. తను తాకట్టు పెట్టిన తల్లి నగలు కూడా అక్కడే ఉండిపోయాయి. అంతేకాదు.. స్నేహితుల దగ్గర చేసిన కొన్ని అప్పులు కూడా తీర్చలేకపోయాడు. దీంతో ఆయన ఫ్రెండ్స్ అంతా తనతో మాట్లాడటం కూడా మానేశారట. డబ్బు ఇంతమందిని దూరం చేస్తుందా అంటూ అసట్లో శర్వా ఎంతగానో బాధ పడిపోయాడట.
అలాంటి సమయంలో తను నటించిన రన్ రాజా రన్ సూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీ తన కెరీర్‌లో మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్. అయినా.. అప్పులతో కూరుకుపోయిన శర్వానంద్.. అప్పట్లో ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడట. ఇక uv క్రియేషన్ సంస్థ ఆ సినిమా సక్సెస్ తో ఓ ప్రైవేట్ పార్టీని ఏర్పాటు చేసింది. సక్సెస్ పార్టీలో అందరూ ఓ వైపు ఎంజాయ్ చేస్తుంటే.. శర్వానంద్ మాత్రం చాలా సైలెంట్ గా మూలన కూర్చుని ఉన్నాడట. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రభాస్ అన్న ప్రమోధ్ ది అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆరోజు ప్రభాస్ కూడా ఆ పార్టీకి వచ్చి సందడి చేశాడు. శర్వా డల్‌గా కూర్చోవడం చూసిన ప్రభాస్.. జరిగిందేదో జరిగిపోయింది.. చివరకు హిట్ వచ్చింది కదా. ఇక నుంచి నీ సరికొత్త జర్నీ ప్రారంభమవుతుంది మంచి టాలెంట్ ఉన్న యాక్టర్ నువ్వు.. కచ్చితంగా నీకు మంచి సక్సెస్ వస్తుంది అని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పాడట. ఇదంతా సర్వానంద ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు.