టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరు అబుదాబి, దుబాయ్ అంటూ డెస్టినేషన్ నగరాల్లో రెగ్యులర్గా విజిట్‌లు చేస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుకుమార్‌తో తన ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకే చరణ అరబఖ్ు వెళ్ళాడు అంటూ గుసగుసలు వినిపించాయి. సుకుమార్తో ఆర్సి 17 చర్చలలో భాగంగా చరణ్ గల్ఫ్‌కి వెళ్లొచ్చాడని.. రంగస్థలం తర్వాత అదే రేంజ్ ప్రాజెక్ట్ కోసం చరణ్, సుక్కు సీరియస్‌గా చర్చలు జరుపుతున్నారని.. ఇది ఒక భార్య యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం. ఇక.. మరొ పక్క అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో సీరియస్ మీటింగులు మొదలుపెట్టారు.
ఆయన కూడా అబుదాబి వెళ్ళిన సంగతి తెలిసిందే. పుష్ప 2 తర్వాత.. బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్‌తో చేయనున్నడంటూ వార్తలు వినిపించాయి. మార్చి 2025 నుంచి సినిమా కొనసాగుతుందంటూ కూడా టాక్ నడిచింది. అయితే.. తాజాగా త్రివిక్రమ్‌తో తన నెక్స్ట్ సినిమా చేయడం లేదని.. తమిళ్ డైరెక్టర్ అట్లితో కలిసి విదేశాలలో చర్చలు జరుపుతున్నట్లు టాక్. అట్లితో మూవీ కోసం రూ.175 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.
ఈ క్రమంలోనే చరణ్, బన్నీ లాంటి ఇద్దరు పెద్ద స్టార్ హీరోస్ తమ ప్రాజెక్టుల గురించి ఎలాంటి లీక్‌లు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారని.. ఇందులో భాగంగానే విదేశాల్లో కథ చర్చలు జరుపుతున్నారని టాక్. హైదరాబాద్, ముంబై, చెన్నై లాంటి చోట్ల ఏదైనా కథ విని.. దాన్ని ఫిక్స్ చేయాలంటే ముందస్తుగా లీఫ్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అభిమానులకు తప్పుడు సమాచారం వెళుతుందని.. ఈ క్రమంలోనే విదేశాల్లో కథ చర్చలు సీక్రెట్ గా జరిపి.. తమ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక ప్రస్తుతం చరణ్, బన్నీ చేస్తున్న ఈ ప్లానింగ్ తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నా.. వాళ్ళ నిర్ణయం మంచిదాని.. కెరీర్‌లో వాళ్లు ఎంచుకున్న కథలతో మంచి సక్సెస్ సాధించాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.