నాకు పవన్ కంటే ఎన్టీఆర్ తో సినిమా చేయడమే ఇష్టం: నాగ వంశీ

ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు తాముతర్కెక్కించిన సినిమాలతో సక్సెస్ అందుకని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్స్ పెట్టినా పెట్టుబడులు సేఫ్ జోన్ లో ఉంచడానికి వారు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. సినిమాను ఎలాగైనా సక్సెస్ తీరానికి చేర్చడం లక్ష్యంగా పాటుపడుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సూర్యదేవర నాగ వంశీ.. చాలా సినిమాలను తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ప్రొడ్యూసర్గ తెర‌కెక్కించిన దాదాపు అన్ని సినిమాలు భారీ సక్సెస్ అందుకుంటున్నాయి.

ఇప్పుడు మ్యాడ్‌ స్క్వేర్‌తో మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు నాగ వంశి సిద్ధమయ్యాడు. అయితే.. సినిమా ప్రమోషన్స్‌లో నాగ వంశి సందడి చేస్తున్నాడు. ఇక‌ తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో జరిగిన ఇంటర్వ్యూలో.. మీకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం ఇష్టమా.. ఎన్టీఆర్ తోనా.. ఒకేసారి ఇద్దరితో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారనే ప్రశ్న ఎదురవ‌గా.. దానికి నాగ వంశీ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ పొలిటిషన్ గా ముందుకు వెళ్తున్నారు. అతని మనం సినిమాలు చేయమని అడక్కూడదు.. జనాలకు సేవ చేయాలనే మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. కనుక అతన్ని అలాగే ఉండనివ్వాలి.

Naga Vamsi's wise move with Devara Nizam Rights - Telugu360

ఎన్టీఆర్ తో సినిమా చేయడం నాకు ఇష్టమంటూ సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానానికి పవన్ ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేస్తున్న.. నాగవంశీ, పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ కు ఆనందపడుతున్నారు. ఇక త‌ను ప్రొడ్యూస్ చేసే సినిమాలు విషయంలోనూ ముందుముందు మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడట. అందుకే ఆయన బ్యానర్ లో ఓ సినిమా చేసిన దర్శకులకు.. మరోసారి అవకాశాలు ఇస్తూ వాళ్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన నుంచి నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ఉంటాయి.. ఆడియన్స్ లో ఎలాంటి రిజల్ట్ నువ్వు అందుకుంటాయో వేచి చూడాలి.