ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కమర్షియల్‌గా తెరకెక్కుతున్న ప్రతి సినిమాలను ఐటెం సాంగ్స్ సర్వసాధారణమైపోయాయి. స్పెషల్ సాంగ్ వల్లే సినిమాపై మంచి బజ్ ఏర్పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంతలా సినిమాలో ఐటమ్ సాంగ్ ఆడియన్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. అలా రీసెంట్గా వచ్చిన పుష్ప 2 సినిమాలో.. కిసిక్ ఐటం సాంగ్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఐటెం సాంగ్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఇక తమన్న, కాజల్, శ్రీ లీల, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్‌లకు డిఎస్పినే సంగీతం అందించిన సంగతి తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో వీరంతా ఐటెం సాంగ్స్ లో మెరుసారు. ఓ రకంగా కెరీర్ రెస్క్‌లో పెట్టారు. అయితే సాంగ్స్ ఫ్లాప్ అయ్యి ఉంటే వీరి ఇమేజ్ మరింతగా పడిపోయి ఉండేది. అలాంటి సాంగ్స్‌కు స్టార్ హీరోయిన్స్ ఎలా ఒప్పుకున్నారు.. అసలు స్టార్ హీరోయిన్లు మీ ఐటెం సాంగ్స్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఒత్తిడి ఉండేదా అని ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు.. డిఎస్పీ రియాక్ట్ అయ్యారు.
దేవిశ్రీ మాట్లాడుతూ.. సమంత కానీ, తమన్నా కానీ, పూజా హెగ్డే కానీ అంత సాంగ్స్ విన్న తర్వాత అది చేయడానికి ఒప్పుకున్నారని.. సమంతకి ముందు సాంగ్ వినిపించలేదని.. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలని చెప్పాం. చాలా రోజులపాటు ఇది చేయాలా.. వద్దా.. అని తెగ ఆలోచించింది. ఒకసారి ఆ సాంగ్ విన్న తర్వాత సమంత వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటూ డిఎస్పి వివరించారు. ఇక సమంత చేసిన ఊ అంటావా మామా సాంగ్ నేషనల్ లెవెల్ ఆడియన్స్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు సమంతకు ఇదే మొదటి ఐటెం సాంగ్ కూడా.