టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటుకున్న పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్.. ఏపి డిప్యూటీ సీఎంగా, అలాగే ఐదు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా పవన్ డిప్యూటీ సీఎం కాకముందే మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీస్ సెట్స్‌పై ఉండగానే.. ఎలక్షన్స్ రావడం డిప్యూటీ సీఎం గా గెలవడంతో ఆ సినిమాల షూట్ కు బ్రేక్ పడింది.
ఈ క్రమంలోనే ఓ పక్క డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తూనే.. మరో పక్కన సమయం దొరికినప్పుడల్లా షూటింగ్లో సందడి చేస్తున్నాడు పవన్. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజి సినిమాల షూటింగ్ ముగించేయాల్సి ఉంది. కానీ.. పవన్ పొలిటికల్ బిజీ కారణంగా ఈ రెండు సినిమాలను ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయాడు. అయితే హరిహర వీరమల్లు షూట్ చివరి దశకు వచ్చింది. మార్చి 28 సినిమా రిలీజ్‌ను కూడా ప్రకటించారు. ఇప్పుడు పవన్ బిజీ స్కెడ్యూల్ కారణంగా మేకర్స్.. రిలీజ్ డేట్ వాయిదా వేసినట్లు సమాచారం. పవన్ నటించిన ఈ సినిమా షూట్ కూడా కొంతమేరకు మాత్రమే పెండింగ్ ఉంది.
అయితే వీరమల్లు రిలీజ్ అయిన వెంటనే ఓజి మిగిలిన షూట్ ను కంప్లీట్ చేసి ప్యాచ్ వర్క్ ముగించి దసరాకు రిలీజ్ చేసేలా టీం ప్లాన్ చేశారు. ఇలాంటి క్రమంలో వీరమల్లు సినిమా షూట్ కంప్లీట్ కాకపోవడంతో ఈ రెండు సినిమాల మేకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు సినిమాలు తో పాటు పవన్ నటిస్తున్న మరో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో మైత్రి మేకర్స్ నుంచి రావల్సిన ఈ మూవీ ఇప్పటికే సట్స్ పైకి రాలేదు. అసలు ఎప్పుడు సెట్స్ ఫై కి వస్తుంది.. సినిమా ఉంటుందా.. లేదా.. తెలియని పరిస్థితి. ఇలాంటి క్రమంలో పవన్ గతంలో అనౌన్స్ చేసిన మరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. పవన్తో సినిమాను గతంలో అనౌన్స్ చేశారు. ఏజెంట్ ప్లాప్ తర్వాత.. సురేందర్, పవన్ కాంబోనా అని అంతా షాక్ అయ్యారు. కాగా పవన్ పొలిటికల్ బిజీతో ఈ సినిమాలో తాను నటించడం కుదరదాన్ని చెప్పేసి.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.