సినీ ఇండస్ట్రీలో ఒకే కథను పోలిన కథలు ఎన్నో వచ్చి వైవిధ్యమైన రిజల్ట్‌ను అందుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాల దర్శకులు.. ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ చేసామంటూ ఓపెన్ గానే చెప్పేస్తారు. కొన్ని సినిమాలు మాత్రం అనుకోకుండా అలా జరుగుతాయి. ఇలానే గతంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఓ అటర్ ప్లాప్ స్టోరీతోనే ఓ కుర్ర హీరో సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడట. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. బ్లాక్ బస్టర్ కొట్టిన ఆ క్రేజీ కుర్ర హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
చరణ్ ఆరెంజ్ సినిమా గుర్తుండే ఉంటుంది. కమర్షియల్ గా అట్టర్ ప్లాప్ అయిననా ఈ సినిమాకు.. ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా ఇటీవల రీ రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. కానీ.. ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు మాత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆరెంజ్ వచ్చి ఆడియన్స్ అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయింది. అయితే.. ఈ సినిమాలో ఓ ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అమ్మాయి కైనా, అబ్బాయికైనా మొబైల్ ఫోన్ పర్సనల్. అది లవర్స్ అయినా, లేదా భార్య ,భర్త లైనా.. అలానే నా ఫోన్ నాకు పర్సనల్ మేటర్.. అని హీరో భావిస్తూ ఉంటాడు. ఇదే అంశంతో తమిళ్ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్.. లవ్ టుడే సినిమా నటించాడు.
ప్రస్తుతం లవర్స్ మధ్యన ఫోన్ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే లవ్ టుడే సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అలా ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఆరెంజ్ సినిమా టైంలో మొబైల్స్ అప్పుడే వస్తున్నాయి. కనుక.. అంతలా ఆ పాయింట్ జనాలకు కనెక్ట్ అయి ఉండకపోవచ్చు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. ప్రదీప్ రంగనాథన్ మాత్రం ఈ సినిమాతో ఏకంగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నుంచి వచ్చిన డ్రాగన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం యూత్‌లో తిరుగులేని క్రేజ్ నెలకొంది. తమిళ్ హీరో అయినా.. ప్రదీప్ తెలుగులోను మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు.