టాలీవుడ్ మహానటి సావిత్రి, జెమినీ గణేషన్ దంపతులకు విజయ చాముండేశ్వరి, సతీష్ ఇద్దరు సంతానం కాగా.. సావిత్రి తనయుడు సతీష్‌కు అసలు నటనపై ఆసక్తి లేకపోవడంతో.. ఇండస్ట్రీ వైపు కూడా చూడలేదు. అయితే కూతురు విజయ చాముండేశ్వరి మాత్రం బుల్లితెరపై నటిగా అడుగు పెట్టింది. కానీ.. అక్కడ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే సావిత్రి వారసుడిగా చాముండేశ్వరి రెండవ తనయుడు అభినయ్ యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సావిత్రి వారసుడుగా తన నటనతో ప్రముఖుల మన్ననలు పొందిన అభినయ్.. తాను మహానటి సావిత్రి మనవడు అనే సంగతి మాత్రం గోప్యంగానే ఉంచాడు.
అభినయ్.. సావిత్రి మనవడు అన్న సంగతి ఇండస్ట్రీలో కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అమ్మమ్మకి వారసుడుగా దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్‌లో తెరకెక్కిన యంగ్ ఇండియా సినిమాతో వెండితెరకు పరిచయమైన అభినయ్.. వ్యక్తిగత లైఫ్ లో టేబుల్ టెన్నిస్‌లో మంచి ప్లేయర్. టేబుల్ టెన్నిస్.. తమిళనాడు రాష్ట్రం తరఫున ఎన్నో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. బీకాం పూర్తి చేసిన వినయ్.. ఎంఎస్ చేయడానికి యూకే వెళ్లారు. ఆ క్రమంలోనే అభినయ్ సావిత్రి గొప్పతనం గురించి.. ఆమెపై జనంలో ఉన్న అభిమానం గురించి తెలుసుకొని నటనపై ఆసక్తిని పెంచుకున్నాడు.
అభినయ్ దృష్టి సినిమాలపై పడింది. అప్పుడే దాసరి తలకెక్కిస్తున్న యంగ్ ఇండియా సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతుండగా ప్రయత్నం చేయమని తండ్రి చెప్పడంతో.. ఆడిషన్స్‌కు వెళ్ళి తన గురించి ఏమీ చెప్పకుండా యంగ్ ఇండియాలో నటుడిగా సెలెక్ట్ అయ్యాడు. నటుడుగా వెండితెరిపై అడుగుపెట్టిన ఆయన.. తనకు బన్నీ, చరణ్, మంచు మనోజ్‌తో మంచి స్నేహం ఉన్నట్లు వివరిస్తూ ఉంటాడు. అమ్మమ్మ సావిత్రి, తాత జెమినీ గణేషన్, పెద్దమ్మ రేఖలు కూడా మంచి నటులే కావడంతో.. అభినయ్ కూడా నటనలో సాహజత్వం చూపిస్తూ ఉంటాడు.
ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన.. హాలీవుడ్‌లో తెరకెక్కిన భారత గణిత మేదవి శ్రీనివాస రామానుజన్ బయోపిక్‌లో కూడా మెప్పించాడు. తన నటనతో దేశ, విదేశా ప్రేక్షకుల మన్ననలను అందుకున్న అభినయ్ మంచి పేరు తెచ్చుకొని.. అమ్మమ్మ నట వారసుడిగా రాణించాలని ఎంతో ఆశపడ్డాడు. అయితే ఇక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో కొంత కాలానికి ఫెడవుట్ అయిపోయాడు. అయితే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 5లో అడుగుపెట్టి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అభినయ్. 2007లో అపర్ణను వివాహం చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చాడు.