సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌గా తెలుగులో మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది నాయనతార. హీరోయిన్గా దాదాపు సౌత్ స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. పలు లేడి ఓరియంటెడ్ సినిమాలతోనూ తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే.. సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ నటిగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరో అక్క పాత్రలో మెరువనుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించేశారు.
ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ స్టార్ హీరో ఎవరు.. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అతను ఎవరో కాదు.. తమిళ్ స్టార్ హీరో యష్. కేజీఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన యష్.. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని టాక్సిక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. 19 మార్చి 2026న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు టీం పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ క్రమంలోనే రిలీజ్ సందర్భంగా టాక్సిక్ సినిమా నిర్మాతలు దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు.. యష్ కూడా ఇండియాలోని పలు ముఖ్య నగరాల్లో అభిమానులతో ముచ్చటిస్తారని.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో యష్ అక్క పాత్రలో నయనతార మెరవనుందట. ఇక నయన్‌ది మూవీలో చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తుంది.