నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా 4 బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు. బాలయ్య కెరియర్లో అఖండ ఎంత స్పెషల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాతే బాలయ్య సక్సెస్ ట్రాక్ ఎక్కి ఫ్లాప్ లేకుండా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆఖండ 2 సీక్వెల్ పై.. ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కనుంది.
ఈ క్రమంలోనే.. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమా సెర్చ్ పైకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ లో సినిమా పై బజ్ నెలకొల్పే విధంగా ఏదో ఒక లీక్ బయటకు వస్తూనే ఉంది. సినిమా కోసం మహాకుంభమేళలో ప్రత్యేకంగా షూట్ ను చేసిన టీం.. తర్వాత హిమాలయాల్లో షూటింగ్ నిర్వహించడం ద్వారా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశారు. ఇక సినిమాలో హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా.. సంయుక్త మీనన్ మరో కీలక పాత్రలో మెరవనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచంట, గోపి అచంట నిర్మిస్తున్న ఈ సినిమా రూ.150 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారని మొదట్లో వార్తలు వినిపించాయి.
అయితే ఈ సినిమాపై ఆడియన్స్‌లో నెలకొన్న హైప్ రీత్యా.. ఎప్పటికప్పుడు సినిమా బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు టీం. ఈ సినిమా కోసం బోయపాటి రాజీ పడకుండా భారీ సెట్స్ వేస్తున్న నేపథ్యంలో.. లిమిట్స్ దాటిపోయి మరీ బడ్జెట్ ఖర్చు అవుతుందట. ఇక ప్రస్తుతం బాలయ్య ఉన్న ఫామ్ లో అఖండ 2 సినిమా.. ఖచ్చితంగా రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ రూ.200 కోట్లు అనేది పెద్ద భారం కాకపోవచ్చు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎస్. జె సూర్య, జగపతిబాబు కీలక పాత్రలో తమిళ్ యంగ్ హీరో ఆది పిన్నిశెట్టి విలన్ పాత్రలో మెరవనున్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు టీం.