టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చివరిగా వచ్చిన చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా.. ఆయన క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే చరణ్ తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ పెట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఆర్సి16 రన్నింగ్ టైటిల్తో బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో చరణ్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రూరల్ బ్యాక్ డ్రాప్‌తో స్పోర్ట్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా మెరవనుంది.
ఇక చరణ్‌కు వ్యక్తిగతంగా స్పోర్ట్స్ ఆడటమంటే చాలా ఇష్టమట. కానీ.. ఇప్పటివరకు తన సినిమాల్లో ఎక్కడ స్పోర్ట్స్ ఆడనేలేదు. డైరెక్టర్స్ కూడా చరణ్‌ను అసలు స్పోర్ట్స్ ఆడే పాత్రలో చూపించలేకపోయారు. కనీసం కామెడీ పరంగా ఎంటర్టైన్ చేయడానికి అయినా.. చరణ్తో స్పోర్ట్స్ ఆడించిన సందర్భాలే లేవు. అలా ఇప్పటివరకు ఏ స్టార్ డైరెక్టర్ కూడా అసలు టచ్ కూడా చేయిని స్పోర్ట్స్‌ను చరణ్ కోసం ఫుల్ కాన్సెప్ట్‌గా తీసుకొని.. స్పోర్ట్స్ డ్రామాగా ఆర్సి 16 తెరకెక్కిస్తున్నాడు బుచ్చి బాబు. నిజంగానే ఇది చాలా పెద్ద సాహసం అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఓ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కోసం పూర్తి స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా నటించడానికి చరణ్ ఓకే చేయడం కూడా కాస్త షాకింగ్ మ్యాటర్.
అయినా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో బుచ్చిబాబు, చరణ్ ఇలాంటి రిస్‌కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వారు ఈ కథపై హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఎలాగైనా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ చరణ్ నమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఆర్సి 16 సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే చరణ్ క్యారెక్టర్ ఇప్పటి వరకు ఆయన లైఫ్లో నటించని ఒక కొత్త పంథాలో ఉండబోతుందని.. చాలా డిఫరెంట్ పాత్రలో చరణ్‌ను బుచ్చిబాబు పరిచయం చేయబోతున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ తో పాటు.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లోను ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.