తాత సినిమాల విషయంలో ఎన్టీఆర్ కోరికలు.. ఏ రేంజ్ లో ఉన్నాయంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ‌ద్ద‌ ఎన్నోసార్లు తాత ఎన్టీ రామారావు సినిమాల విష‌యంలో టాక్ వినిపించినా ఆయన ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో దానిపై స్పందించలేదు. పౌరాణిక సినిమాలు చేయడానికి సాహసం చేయలేదు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తారక్ తాత సినిమాలపై చేసిన కామెంట్స్ నందమూరి అభిమానుల్లో కొత్త ఆశలను రేక్కెతిస్తున్నాయి. ఇక పౌరాణిక సినిమాల్లో తారక్ న‌టిస్తే కచ్చితంగా సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొంటాయి. మోడ్ర‌న్ టచ్‌తో.. అదే ఒరవడిలో తాత వారసత్వాన్ని కొనసాగించగల సత్తా తారక్‌కు ఉందంటూ సోషల్ మీడియాలో ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కానీ.. తారక్ మాత్రం ఇంతవరకు కేవలం మాస్ కమర్షియల్ సినిమాల్లో మాత్రమే నటిస్తూ సత్తా చాటుతున్నాడు. నిజానికి కెరీర్ ఆరంభంలో తాత సినిమాలోని డైలాగులను, పాటలను ఎన్నోసార్లు రిపీట్ చేస్తూ వచ్చిన తార‌క్‌.. క్లియర్గా యమదొంగ సినిమాలో యమగోల గుర్తులను హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ.. ఫుల్ లెన్త్ పౌరాణిక సినిమాలో మాత్రం తారక్‌ ఎప్పుడు నటించలేదు. దానికి కారణం తాతల పౌరాణిక సినిమా చేయాలంటే కచ్చితంగా ఆయన స్థాయికి అనుగుణంగా నటించాల్సి వస్తుందని బావించాడ‌ట‌. అంతేకాదు దానికోసం డైరెక్టర్, ప్రొడ్యూసర్, అలాగే టైం బ్యాలెన్స్, మార్కెట్ ఎస్టిమేషన్ కూడా పర్ఫెక్ట్ గా చూసుకోవాలి.

Jr NTR Oscar 2023: US Magazine says, 'NT Rama Rao Jr's performance in 'RRR'  deserves an Oscar nod' - The Economic Times

ఇలాంటి క్రమంలో ఇంటర్వ్యూలో తారక్ ఈ విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాతగారి సినిమాలు రీమేక్ చేయడం అంటే నాకు నిజంగా పెద్ద గౌరవం. కానీ.. సరైన డైరెక్టర్, నిర్మాత మంచి కాంబినేషన్లు కలిసొస్తేనే అలా చేయగలుగుతా. ఆయన పౌరాణిక ప్రస్తానానికి తగిన విలువ కలిగిన సినిమాలు చేయాల్సి ఉంటుంది. అవకాశం వస్తే తప్పకుండా అలాంటి సినిమా చేయడానికి రెడీ అంటూ తారక్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే తారక్ ఫ్యాన్స్‌లో సరికొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇప్పట్లో ఎన్టీఆర్‌కు అలాంటి సినిమాల్లో నటించే అవకాశం లేదు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్న ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ తో పాటు వార్ 2, ప్ర‌శాంత్ నీల్‌.. డ్రాగన్, కొరటాల శివ.. దేవర 2 ప్రాజెక్టులను లైన్లో ఉంచుకున్నాడు. ఇవన్నీ పూర్తవడానికి ఎంత లేదన్న మూడేళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే తాత ఎన్టీఆర్ కథలు ఎన్టీఆర్ రీమేక్ చేయడానికి ఇప్ప‌ట్లో అవకాశం లేదు.