అఖండ 2 పై బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ అప్డేట్.. నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలయ్య.. అఘోర పాత్రలో ఉగ్రరూపం చూపించి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేసిన సినిమా అఖండ‌. టాలీవుడ్ ఆడియన్స్ లో ఎప్పటికీ ఈ మూవీ గుర్తుండిపోతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా.. తాజాగా బోయపాటి మరోసారి బాలయ్య ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ సిద్ధం చేస్తున్నాడు.

అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండ‌వం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ తాండవానికి సిద్ధమయ్యాడు బాలయ్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర‌వేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజి అప్డేట్‌.. టాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ వైరల్ గా మారుతుంది. బాలయ్య ఇంట్రో సీన్ గూస్ బంప్ తెప్పించేలా ఉంటుందని.. అఘోరపాత్రలో బాలయ్య.. హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తూ పవర్ఫుల్ లుక్స్ తో మెరవనున్నాడని.. ఇక ఈ ఎంట్రీ సీన్ విజువల్స్ ఆడియన్స్ లో గూస్ బంప్ తెప్పించడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవనుందట‌.

ఇక ఏంట్రీ సీన్‌తో పాటు.. హిమాలయాల్లో కొన్ని కీలక సన్నివేశాలను సైతం షూట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు టీం. ఇక హిమాలయాల్లో బాలయ్య అఘోర గెటప్‌లో ఈ సన్నివేశాలు అన్నీ రూపొందించరున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామచంట, గోపి ఆచంట సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు.. థ‌మ‌న్‌ సంగీత దర్శకుడుగా వ్యవహరించినన్నాడు. ఇక బోయపాటి, బాలయ్య, థ‌మన్ కాంబో సినిమా అంటేనే ఆడియన్స్లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉంటాయి. అలాంటిది అఖండ లాంటి సినిమాకు సీక్వెల్ అంటే మరోసారి బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ కాంబో పై కేవలం నందమూరి ఫ్యాన్స్ లోనే కాదు.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి ఆసక్తి నెలకొంది.