సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ పెద్దగా మారడు మెగాస్టార్ చిరంజీవి. 1995 ఆగస్టు 22న పశ్చిమగోదావరి జిల్లా.. మొగల్తూరు గ్రామంలో.. కొణిదెల వెంకటరమణ, అంజన దేవి దంపతులకు జన్మించిన చిరంజీవి.. 25వ ఏట 1980లో అప్పటి పాపులర్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకొని ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రీజ.. కొడుకు రామ్ చరణ్.. వీరు ముగ్గురికి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే పెద్ద కూతురు సుస్మిత.. చెన్నైలో సెటిల్ అయినా విష్ణు ప్రసాద్ ను వివాహం చేసుకుంది.
ఇంతకీ ఆ విష్ణు ప్రసాద్ బ్యాగ్రౌండ్ ఏంటి.. ఒకసారి తెలుసుకుందాం. విష్ణుప్రసాద్ కుటుంబం రాయలసీమ నుంచి తమిళనాడు వెళ్లి అక్కడ సెట్టిల్ అయ్యారు. విష్ణుప్రసాద్ తాతయ్య.. ఎల్వి. రామారావు అప్పట్లో చెన్నైలో పేరు మోసిన బిజినెస్ మ్యాన్‌గా రాణించారు. జపాన్, సింగపూర్, అమెరికా లాంటి దేశాలతో ఆయన బిజినెస్ లావాదేవీలను నడిపేవాడు. ఇక ఆయన కుమారుడు ఎల్వి ప్రసాద్, చంద్రిక దంపతులకు ఏకైక కుమారుడు విష్ణు ప్రసాద్. విష్ణు ప్రసాద్ కూడా బిజినెస్ రంగంలో అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీని పూర్తిచేసి.. చదువు పూర్తయిన వెంటనే బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టాడు.
తాత స్థాపించిన పామాయిల్ వ్యాపారాన్ని తండ్రి సారథ్యంలో బాగా డెవలప్ చేశాడు. ఇప్పుడు విష్ణు ప్రసాద్ అదే వ్యాపారాన్ని రెండింతలు పెంపొందించాడు. ఇక విష్ణుప్రసాద్.. సుస్మిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. సుష్మిత ప్రస్తుతం తన భర్త ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఇక సుస్మిత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఓల్డ్ స్టూడెంట్. తాను నేర్చుకున్న చదువును ఇప్పుడు సినిమాలలో ఉపయోగిస్తుంది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150కి కాస్ట్యూమ్ డిజైనర్. సుస్మిత సినీ బ్యాగ్రౌండ్ గల ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఈ క్రమంలోనే సుస్మితకు ఆ రంగంపై ఉన్న మక్కువను గమనించిన విష్ణు ప్రసాద్.. సుస్మితను సినీ రంగంలోకి ప్రవేశించేలా ప్రోత్సహించారు.