ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. నేషనల్ వైడ్‌గా తన సత్తా చాటుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను దక్కించుకున్న ఆయన.. తన నెక్స్ట్ సినిమాలన్నింటినీ పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. కల్కి , సలార్ బ్లాక్ బాస్టర్‌లతో మంచి జోరు మీద ఉన్న ప్రభాస్.. ప్రస్తుతం హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే రెబల్ స్టార్ నుంచి రాబోయే నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఏడాదికి రెండు సినిమాలు తన నుంచి రిలీజ్ చేసేలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడట ప్రభాస్. అలా.. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్‌తో పాటు.. హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఇండియన్ నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్న ప్రభాస్.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో మరోసారి తనని తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోనున్నారు. ఇలాంటి క్రమంలో ప్రభాస్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఆయనకంటే వయసులో చిన్నదైనా ఓ హీరోయిన్ ప్రభాస్ తల్లిగా నటించిన న్యూస్ ట్రెండ్ అవుతుంది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆ మూవీ పేరు ఏంటో చెప్పలేదు కదా.. ప్రభాస్ నటించిన మున్నా. ఇక ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి ప్రభాస్ కు తల్లిగా నటించింది. కళ్యాణి.. ప్రభాస్ కంటే వయసులో చాలా చిన్నది. ఈ క్రమంలోనే ఆమె నటించే పాత్రలపట్ల విమర్శలు ఎదురైనా.. తాను ఎంచుకున్న పాత్రకు వందశాతం న్యాయం చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. మున్నా సినిమాలను ప్రభాస్ తల్లి పాత్రలో మెప్పించింది. అయితే సినిమా స్టోరీ తాడపడడంతో.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. అయినా ప్రభాస్ మాత్రం ఎక్కడ వెనుకడుగు వేయకుండా సినిమాలపై మరింత కాన్సెంట్రేట్ చేసి మంచి సక్సెస్ అందుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వస్తే చాలు.. ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం అంటూ ఎంతో మంది నటీనటులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ను అభిమాన హీరోగా ఆరాధిస్తున్నారు.