సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ప్రస్థానం చాలా పెద్దది. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి.. మొదట విలన్ రోల్స్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. తర్వాత.. హీరోగా అవకాశాలు దక్కించుకొని ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్లు అందుకుంటూ స్టార్ హీరోగా మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు. అయితే అలాంటి చిరంజీవికి యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చింది ఓ హీరో అని చాలామందికి తెలియదు. అయితే ఆయన చిరుకి ఎన్నో సపరేట్ మూమెంట్స్ కు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చారు. ఇక చిరుకి శిక్షణ ఇచ్చిన ఆ గురువే.. తర్వాత చిరంజీవి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్‌లో నటించడం విశేషం. 1978లో నటుడిగా మారిన చిరంజీవి.. అంతకుముందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
నటుడిగా ట్రైనింగ్ తీసుకున్నాడు. నటనపై ఆసక్తితో మద్రాసు వెళ్లి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా చిరు.. అక్కడ శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే పునాదిరాళ్లు సినిమాలో అవకాశం అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మద్రాస్ ఇన్స్టిట్యూట్లో ఆయనకు యాక్టింగ్ లో శిక్షణ ఇచ్చింది ఒక కామెడీ హీరోనట. ఆ కామెడీ హీరో కూడా మన టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ సుపరిచితమే. అతను మరెవరో కాదు రాజేంద్రప్రసాద్. ఇక అప్పటికి రాజేంద్రప్రసాద్ కూడా నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. కాకపోతే చిరంజీవి కంటే మూడేళ్లు సీనియర్. అలాగే మైమ్ అండ్ మూమెంట్లలో గోల్డ్ మెడలిస్ట్.
దీంతో ఇన్స్టిట్యూట్లో అదే సమయంలో దేవదాసు కనకాల టీచర్గా రిజైన్‌చేసి హైదరాబాద్‌కు వెళ్ళిపోవడంతో.. ఆ పోస్ట్ ఖాళీగా ఉందని రాజేంద్రప్రసాద్ క్లాసులు చెప్పాలని ప్రిన్సిపల్ పార్థసారథి ఆదేశించారట. దీంతో రాజేంద్రప్రసాద్ క్లాసులో నిర్వహించేవాడు. అలా ఫ్రెషర్గా వచ్చిన చిరంజీవి బ్యాచ్ కి రాజేంద్రప్రసాద్ క్లాసులు చెప్పారు. మైమ్ అండ్ మూమెంట్ సబ్జెక్టులో చిరంజీవికి క్లాసులు చెప్పానని రాజేంద్రప్రసాద్ స్వయంగా వివరించాడు. క్లాసులు చెప్పడం అంటే యాక్టింగ్ ఎలా చేయాలో.. ఏ మూమెంట్ ఎలా చేయాలో చేసి చూపించడం. అది తనకు బాగా వచ్చు కాబట్టి రెచ్చిపోయే అంటూ రాజేంద్రప్రసాద్ వివరించాడు. ఇక తర్వాత చిరు సూపర్ స్టార్ గా రాణిస్తున్న టైం లోనే ఆయన సినిమాల్లోనే ఫ్రెండ్గా, సెకండ్ హీరోగా రాజేంద్రప్రసాద్ మెరిశాడు. ఓ పక్క హీరోగా రాణిస్తూనే.. మరోపక్క ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటించారు రాజేంద్రప్రసాద్.