టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో ఎంత పవర్ఫుల్ కాంబోణక్ష ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబోలో రంగస్థలం తెరకెక్కి మ్యాజిక్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో చరణ్ నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక సినిమా తర్వాత ఆయన కథల సెలక్షన్‌తోపాటు.. బాడీ లాంగ్వేజ్ లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వరుస సక్సెస్‌లను అందుకుంటూ మెగా పవర్ స్టార్‌గా ఎదిగారు. అయితే.. దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ వీరిద్దరికి కాంబో రిపీట్ కానుంది.
త్వరలోనే ఆర్‌సి 17 రన్నింగ్ టైటిల్ తో సుకుమార్, చరణ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే చరణ్, సుకుమార్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్ వైరల్ గా మారుతుంది. ఇక రామ్ చరణ్, సుకుమార్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇక చరణ్ కెరీర్‌ను మలుపు తిప్పింది కూడా సుకుమార్ సినిమానే అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి సుకుమార్‌కు రామ్ చరణ్ నటించిన అన్ని సినిమాలలో ఏ సినిమా ఫేవరెట్ తెలుసుకోవాలని ఆసక్తి చాలామందిలో ఉంటుంది.
కాగా సుకుమార్‌కు రామ్ చరణ్ చేసిన సినిమాల్లో రెండు సినిమాలంటే చాలా ఇష్టమట. వాటిలో చిరుత ఒకటి కాగా, మరొకటి మగధీర. ఈ రెండు సినిమాలు.. చరణ్ కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలైనా.. ఎంతో ఎక్స్పీరియన్స్ నటుడిగా సినిమాల్లో కనిపించాడని.. అప్పటినుంచి చరణ్‌తో సినిమా చేయాలని సుక్కు ఫిక్స్ అయ్యినట్లు టాక్. అలా అనుకొని వర్క్ అవుట్ చేసిందే రంగస్థలం అట. ఇక ఈ సినిమాలో డీ గ్లామరస్ రోల్.. అందులోనూ చెవిటి చిట్టిబాబు పాత్రలో చేయడానికి కూడా చరణ్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమా చరణ్ కెరీర్ కు ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.