సినీ ఇండస్ట్రీలో మొదట ఓ హీరో కోసం అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక కాంబోలో ఫిక్స్ అయిన కథ.. తర్వాత క్యాన్సిల్ అయ్యి మరొకరు ఆ సినిమాల్లో నటించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్లు కాగా.. మరికొన్ని ప్లాప్‌లుగా నిలుస్తాయి. అయితే.. ఓ హీరో వదులుకున్న కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొడితే నిజంగా సినిమా మిస్ చేసుకున హీరోది బ్యాడ్ లక్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా.. బాలయ్య కెరీర్‌లోను ఎన్నో సినిమాల విషయంలో జరిగింది. అయితే.. బాలయ్య చేయాలనుకున్న ఒక కథను హీరో వెంకటేష్ నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడట.
ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 1990లో బాలయ్య, వెంకటేష్ ఇద్దరు వరుస సక్సెస్ లతో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పరుచూరి బ్రదర్స్.. యాక్షన్ సినిమాల డైరెక్టర్ బి. గోపాల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని భావించారట. కథ కూడా సిద్ధం చేసుకున్నారట. అలాంటి క్రమంలో కోలీవుడ్లో చిన్న తంబి అనే సినిమాకు పి. వాసు డైరెకత్వం వహించి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాను చూసిన బి.గోపాల్ సినిమా చూశాను.. చాలా బాగుంది.. మీరు కూడా చూడండి.. బాలయ్య ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందంటూ వివరించారట.
వెంటనే పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాను చూసి నిజంగానే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది.. బాలయ్య చేస్తే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని వివరించారట. సినిమా రైట్స్ కొనే విషయంలో ఆలస్యం జరిగిపోయింది. ఇంతలో కమర్షియల్ క్రియేటివ్ అధినేత.. కే.ఎస్.రామారావు ఈ రైట్స్ కొనుగోలు చేసి.. వెంకటేష్‌ను హీరోగా ఫిక్స్ చేశారు. ఇక రవిబాబు పిన్నిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవి కొట్టిసక్సస్ అందుకుంది. అదే చంటి మూవీ. ఈ సినిమా వెంకీ కెరీర్ లోనే చాలా స్పెషల్. టాలీవుడ్‌లో వెంకటేష్ తిరుగులేని హీరోగా మార్చిన సినిమా కూడా ఇదే అనడంలో అతిసయోక్తి లేదు. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా మీనా నటించగా.. చంటి పాత్రలో వెంకీ ఇన్నోసెంట్ యాక్టింగ్‌తో అప్పటి మహిళలను కంటతడి పెట్టించాడు. రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన నటనకు ఫిదా అయ్యాయి. అలా అప్పట్లోనే చంటి సినిమా 40 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన రికార్డ్ సొంతం చేసుకుంది.