చిరంజీవి కెరీర్ మొత్తంలో ఆయ‌న నటించి.. తన పుట్టినరోజున రిలీజ్ అయిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు.. ఆగస్టు 22 ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆ రోజు చిరు పుట్టినరోజు కావ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండ‌గాలా గ్రాండ్‌గా ఫ్యాన్స్‌ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్.. పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించిన చిరు.. ఓ మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 1978లో పునాదిరాళ్లు సినిమాతో నటుడుగా పరిచయమైన చిరు.. అప్పటి నుంచి తిరుగులేని నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎంతోమంది స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సత్తా చాటుకుని.. మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు.

Chantabbai Movie || Chiranjeevi Telling Emotional Flashback Scene||  Chiranjeevi,Suhasini

భారీ స్టార్డం దక్కించుకున్నాడు. నేషనల్ లెవెల్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా.. యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్.. విశ్వంభ‌ర‌ సినిమా ప‌నులో బిజీగా గ‌డుపుతున్నాడు. అయితే తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో చిరంజీవి పుట్టిన రోజున రిలీజ్ అయిన ఏకైక సినిమా ఏంటో.. దాని డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాల‌ని ఆశ‌క్తి చాలా మందిలో ఉంటుంద‌. ఇంత‌కి ఆ మూవీ ఏదో కాదు.. జంధ్యాల దర్శకత్వంలో.. చిరంజీవి హీరోగా, సుహాసిని హీరోయిన్గా తెర‌కెక్కిన ఇన్వెస్టిగేటివ్ కామెడీ డ్రామా చంటబ్బాయి.

Prime Video: Chantabbai

ఈ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ముచ్చర్ల అరుణ్, చంద్రమోహన్, కొంగరు జగ్గయ్య, రవికొండలరావు తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు.. కే.చక్రవర్తి సంగీతం అందించారు. జ్యోతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై.. 1986 ఆగస్టు 22న ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుంది. కలెక్షన్ల పరంగాను మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాల్లో చిరు చేసిన కామెడీ ఇప్పటికీ ఆడియన్స్‌లో గుర్తుండే ఉంటుంది. చిరు యాక్షన్ హీరోగా చెలరేగిపోతున్న రోజుల్లో.. ఓ కంగారు టైప్ ప్రైవేట్ డిటెక్టివ్ గా కామెడీ పాత్రలో నటించి సక్సెస్ సాధించారు. అలా చిరు కెరీర్‌లోనే మంచి కామెడీ ఎంటర్టైనర్‌గా చంటబ్బాయి సినిమా మిగిలిపోయింది. ఇక.. ఈ సినిమాల్లో చిరు బామ్మర్ది.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఓ చిన్న పాత్రలో మెరిశాడు.