సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్‌గా రాణించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కానీ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొంతమంది హీరోయిన్స్ మాత్రం.. నటించిన అతి తక్కువ సినిమాలతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకునే స్టార్ హీరోయిన్‌లుగా మారిపోతూ ఉంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ ముద్దుగుమ్మ కూడా అదే కోవకు వస్తుంది. కేవలం ఒకే ఒక్క హిట్‌తో సౌత్ ఇండస్ట్రీలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం.. అరడజన్ సినిమాలను లైన్లో పెట్టుకుంది. ఇంతకీ ఈమె ఎవరో చెప్పలేదు కదా.. మమిత బైజు. అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
మలయాళ సినిమా ప్రేమలుతో ఒక్కసారిగా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా కంటే ముందే దాదాపు 56 ఏళ్లగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. మలయాళంలో పలు సినిమాలో నటించినా ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ.. ఇటీవల బ్లాక్ బస్టర్గా నిలిచిన ప్రేమలతో అమ్మడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మలయాళంలో వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కేవలం మలయాళ ఇండస్ట్రీలోనే కాదు.. కోలీవుడ్‌లో ఈమెకు మూడు, నాలుగు సినిమాల ఛాన్స్ లో వచ్చినట్లు సమాచారం. అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో కీలక పాత్రలో మమిత మేరవనుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే.. ఇరండు వానం సినిమాల్లో సెలెక్ట్ అయింది.
ఈ సినిమా షూటింగ్ అయితే సరవేగంగా జరుగుతుంది. ఇదే టైంలో ప్రేమలు 2 సినిమాకు కూడా ఫిక్స్ అయింది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేయబోతున్న మరో కొత్త సినిమాలో కూడా మమిత బైజు సెలెక్ట్ అయిందని టాక్. విగ్నేష్ రాజ్ డైరెక్షన్‌లో ధనుష్ సినిమాలో మమిత మేరవనుందని సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోలీవుడ్‌లో మమిత జోరు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథ్ హీరోగా మరో సినిమాకు సెలెక్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతోపాటు తమిళ్లోను ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు ప్రదీప్ రంగనాథ్. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా మొత్తానికి ఒక ప్రేమలుతో అమ్మడు అరడజనుకు పైగా సినిమాల్లో ఛాన్సులు కొట్టేసి దూసుకుపోతుంది. ముందు ముందు ఈ అమ్మడు టాలీవుడ్ లో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.