ఎన్టీఆర్ మూవీ సస్పెన్స్ కి చెక్.. ఈసారి దానికి మించి అంటూ హైప్ పెంచేసిన స్టార్ ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ లైనప్‌లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ వార్ 2, ప్ర‌శాంత్ నీల్ ఫౌజీ, అలాగే దేవ‌ర 2 కూడా తార‌క్ చేయాల్సి ఉంది. ఇలాంటి క్రమంలో మ‌రో మూవీ కోసం కోలివుడ్ డైరెక్ట‌ర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కు తార‌క్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. కాగా తాజాగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ నాగవంశీ.. తాను తారక్‌తో చేయబోతున్న సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ షేర్ చేసుకున్నాడు.

తార‌క్ – నెల్సన్ కాంబోకు అనిరుథ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడ‌ని.. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతుందని వినిపిస్తున‌ వార్త‌ల‌పై నాగ‌వంశీ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆయ‌న‌ దీనిపై మాట్లాడుతూ.. తార‌క్‌ నెక్ట్స్ చేయబోతున్న సినిమా వేరే లెవల్లో ఉంటుందని వివ‌రించాడు. ఇక‌ అది నెల్సన్‌ మూవీ అని ఆయన చెప్పకున్న ఆయ‌న మాట్ల‌డింది దాని గురించే అని అర్ధ‌మౌతుంది. నిజానికి సితార బ్యానర్‌పై గ‌తంలో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబోలో ఓ మూవీ రావాల్సి ఉంది. కానీ.. అది ఆగిపోయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ – మహేష్‌తో.. తార‌క్ – కొరటాలతో సినిమా చేశారు.

అలా తార‌క్, త్రివిక్రమ్‌ మూవీ మిస్‌ అయ్యింది. ఇక ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్‌ అయినందుకు తాను చాలా బాధపడ్డాన‌ని నాగవంశీ చెప్పుకొచ్చాడు . కానీ.. ఇప్పుడు తీయ‌నున్న‌ మూవీ దాన్ని మించి ఉంటుందని.. త్వరలో అది చూస్తారని తార‌క్‌, నెల్సన్‌ మూవీపై భారీ బ‌జ్ క్రియేట్ చేశాడు. మరి ఇది ఏ రేంజ్‌లో ఉండ‌నుందో.. ఏ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్క‌నుందో వేచి చూడాలి. ఇక ఓ భారీ యాక్షన్‌ మూవీని తార‌క్ కోసం నెల్స‌న్ ప్లాన్‌ చేస్తున్నాడ‌ని.. ఎన్టీఆర్‌ రోల్‌ వేరే లెవల్‌ అని.. వెయ్యి కోట్లు పక్కా అంటూ సమాచారం. ఇక ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.