ఇండియన్ సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్..స్పేస్ లో తొమ్మిది నెలల ఎమోషనల్ జర్నీ తర్వాత తాజాగా భూమి పైకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా మీడియా హెడ్లైన్స్‌లో నిలిచిన సునీత విలియమ్స్.. బుధవారం ఐఎస్టి కాలమానం ప్రకారం 2 – 41 ఏఎంకి స్పేస్ఎక్స్ క్య్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకలో సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా జనం అంతా ఆమె సురక్షితంగా భూమి పైకి తిరిగి రావాలని కోరుకున్నారు. వారి కోరిక ఫలించి సునీత విలియమ్స్ భూమిపైకి సేఫ్‌గాల్యాండ్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారాయి.
ప్రముఖ రాజకీయ నాయకులు అభిమానుల నుంచి కోట్లల్లో అభినందనలు వెల్లువెత్తాయి. ఇలాంటి నేపథ్యంలో సునిత విలియమ్స్‌కు సంబంధించిన ఎక్సైటింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. సునీత విలియమ్స్ అద్భుతమైన లైఫ్ జర్నీ ఆధారంగా ఒక బయోపిక్‌ను రూపొందించాలని.. ప్రముఖ డైరెక్టర్ ఆసక్తిగా ప్లాన్ చేస్తున్నాడట. సైంటిస్ట్ కం అడ్వెంచర్స్ ఉమెన్ సునీత విలియమ్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీని తెరపై చూపించేందుకు ప్రఖ్యాత నిర్మాతలు సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ డైరెక్టర్స్ ఆమె లైఫ్ జర్నీ సినిమాగా రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.
బాలీవుడ్‌లో మాత్రమే కాదు.. హాలీవుడ్‌లో సైతం సునీత విలియమ్స్ బయోపిక్‌పై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే.. ఆమె లైఫ్ అండ్ అడ్వెంచరస్ జర్నీని.. ఎక్స్పెరిమెంట్స్, టఫ్ ట్రైనింగ్, తర్వాత నాసాలో చేరడం.. మొత్తం 322 రోజులు అంతరిక్షంలో చిక్కుకొని అక్కడ లైఫ్ లీడ్ చేయడం.. ఎట్టకేలకు భూమిపైకి సక్సెస్ఫుల్గా తిరిగి రావడం.. ఇలా సునీత లైఫ్‌లో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని ఒక థ్రిల్లర్గా తెరకెక్కించాలని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సునీత ఇండియన్. అలాగే.. అమెరికన్ సైంటిస్ట్ అందుకే భారతదేశ సహా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో ఈ బయోపిక్ వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.