నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య వార్ తప్పేలా లేదంటూ ఓ టాక్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. అయితే.. పరిస్థితులు కూడా ఆ వార్తలకు తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం భారీ అంచనాల మధ్యన రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరోసారి బాలయ్య నట విశ్వరూపం తాండవంతో చూపించబోతున్నాడని ఇప్పటికే ఆడియన్స్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఎక్సోటిక్ లొకేషన్లో ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుంది. బాలయ్య నార్త్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా కొన్ని ప్రదేశాలను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే కుంభమేళలో షూట్ సన్నివేశాలు పైర్తి అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తేదీని కూడా బోయపాటి గతంలోనే ప్రకటించారు. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయనున్నట్లు వివరించాడు. ఈ సినిమా డిలే అయ్యా అవకాశం లేదు. చెప్పింది చెప్పినట్లుగా రిలీజ్ అవుతుందని అంత భావిస్తున్నారు. పైగా బాలయ్య సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారంటే.. దాని వెనుక ఎన్నో సెంటిమెంట్స్, లాజిక్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాకు ఆలస్యం అయ్యే ఛాన్స్ లేదు. కాగా ఈ క్రమంలో సరిగ్గా సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఓజి షూటింగ్ డిలే అవుతున్న క్రమంలో.. యూనిట్ సెప్టెంబర్ 25 కు సినిమా రిలీజ్ డేట్ ను మార్చేలా ప్లాన్ చేస్తున్నారట.
అదే జరిగితే బాలయ్య వర్సెస్ పవన్ వార్ స్ట్రాంగ్ గానే ఉంటుందంటూ టాక్ నడుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని బాలయ్య వెనుక తగ్గడు. ఆయన రాజీ పడే ప్రసక్తే లేదు. పైగా సీనియర్ హీరో. ఈ క్రమంలోనే బాలయ్య పెద్దరికని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ తగ్గుతాడా.. లేదా ఆయన కూడా పోటీకి సిద్ధమవుతాడా.. అనేది వేచి చూడాలి. వార్‌కు రెడ్డి అయితే మాత్రం.. సెప్టెంబర్ 25న సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాను వాయిదా వేసుకుంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య వర్సెస్ పవన్ వార్ ఉంటుందా.. లేదా.. తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.