టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన.. కష్టానికి తగ్గ ఫలితాన్ని దక్కించుకుంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోట్లను కూడబెడుతున్న ప్రభాస్ ఇంట్లో.. ఓ కోటి రూపాయల చెట్టు కూడా ఉందనే న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే నెటిజన్స్ ఆ చెట్టు కాస్ట్ తెలిసే ఆశ్చర్యపోతున్నారు. వామ్మో.. ఒక చెట్టుకు కోటి రూపాయల.. కోటి రూపాయలు పెట్టుకొని మరీ ఇంట్లో ఆ చెట్టును పెంచుకునే అంత స్పెషల్ ఆ చెట్టులో ఏముంది.. అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి. అయితే ఇంతకీ ఆ చెట్టు స్పెషాలిటీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
మనుషులకి కోరికలు సహజంగానే ఉంటాయి. అయితే ఎలాంటి కోరికలునైనా తీర్చగల చెట్టే కల్ప వృక్షమని మన పురాణాల్లో రాసి ఉంటుంది. మన కోరికలు అన్నిటిని కల్పవృక్షం తీరుస్తుందని భగవద్గీతలో వివరించారు. కోరికలు కోరడం కాదు.. కానీ ఆ కోరికల న్యాయం లేకపోయినా, తప్పుడు కోరికలు కోరుకున్న అవి నెరవేరవట. అలా భూమి పై కల్ప వృక్షాలను తప్పుడు కోరికలు కోరుకోవడం వల్లే ఇంద్రుడు తన స్వర్గలోకానికి తీసుకువెళ్లిపోయాడని.. ఐదు తోటాల మధ్య కల్ప వృక్షాన్ని నాటాడని అంటూ ఉంటారు. అక్కడ కలప వృక్షం తో పాటు మందన, పారిజాత, సంతన, హరిచంద్ర వృక్షాలు కూడా ఉంటాయట. ఇవి కూడా కల్పవృక్షం లాగే కోరికలను తీరుస్తాయని హిందూపురాణాల్లో చెప్పారు.
ఇంతకి ఇప్పుడు ఈ కథంతా ఎందుకు చెబుతున్నారు.. ప్రభాస్ ఇంట్లో ఉన్న చెట్టుకి.. దీనికి సంబంధం ఏంటి అనే సందేహం అందరిలోనూ వస్తుంది. అయితే ఈ కల్పవృక్షం అవశేషాలు ఇంకా భూమిపై ఉన్నాయని.. దీని అంశ నుంచే వచ్చిన మొక్కలు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైనా చాలా తక్కువ మంది ఇళ్లల్లో ఉంచినట్లు సమాచారం. అలా ఇండియాలో రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో ఈ కల్ప వృక్షం తాలూకా మొక్కలు ఏకంగా నాలుగు ఉన్నాయట. ఈ మొక్కలు ధనవంతులను చేస్తాయని.. ఇంటి శ్రేయస్సుకి తోడ్పడే శక్తి వాటిలో ఉంటుందని.. జ్యోతిష్యులు ఇప్పటికే పలు సందర్భాల్లో వివరించారు. అంతేకాదు అదృష్టాన్ని మరింత ప్రకాశవంతంగా చేసే సులభమైన మార్గం ఈ చెట్టు వల్లే వస్తుందని.. ఈ చెట్లను పెంచడంతో మరింత ధనవంతులు కావచ్చు అని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే అంబానీ కూడా దీనిని నమ్ముతారట. అంతేకాదు రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ఉన్న కోటి రూపాయలు విలువ చేసే మొక్క కూడా అదేనట. ఈ కల్ప వృక్షం చెట్టు ప్రభాస్, ముకేశ్ అంబానీ ఇంట్లో మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ వృక్షం గురించి తెలిసిన పలువురు లాజికల్ ప్రశ్నలను కూడా సందించారు. అయితే అంబానీ ఇంకా డబ్బు సంపాదించడానికి బిజినెస్ ఎందుకు చేస్తున్నాడు.. ప్రభాస్ సినిమాలు ఎందుకు తీస్తున్నాడని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ నమ్మకాలను ఆచరించే పలువురు మాత్రం దీనిపై రియాక్ట్ అవుతూ.. కల్ప వృక్షాన్ని కోరినంత మాత్రాన కోరికలు తీరిపోవు.. కాని ఆ కోరికను తీర్చుకునే సులువమైన మార్గం దొరుకుతుంది. ఆ మార్గాన్ని ఎంచుకొని మనం కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకోవాల్సి ఉంటుందంటూ.. కల్పవృక్షం నీడలో కూర్చుని కోరికలు కోరుకున్నంత మాత్రాన అన్ని కోరికలు తీరిపోవు.. దానికి తగ్గ ప్రయత్నం కూడా ఉండాలని కౌంటర్లు వేస్తున్నారు.