సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ధీంతో సెలబ్రెటీల ఓల్డ్ ఫోటోస్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఓల్డ్ ఫోటో ఒకటి తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఇందులో సచిన్‌తో పాటు.. ఉన్న కుర్రాడు ఎవరా అన్ని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటి\న్స్. ఈ క్రమంలోనే.. ఈ కుర్రోడు ఒక టాలీవుడ్ క్రేజీ హీరో అని రిలీజ్ అయింది. అంతేకాదు.. అతని తండ్రి సైతం టాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు తండ్రి బాటలోనే ఈ కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి.. తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నాడు.
ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ కుర్రాడు.. మాస్ క్లాస్ డ్యాన్స్‌లతో యూత్ కు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ ప్రాజెక్టును నటిస్తున్నాడు. ఈ కుర్ర హీరోకి కూడా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. తెలుగులో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ క్రేజీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? సర్లేండి మేమే చెప్పేస్తాం.. అతనే సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. శ్రీకాంత్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోషన్.. నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న చాలా కాలం గ్యాప్ తర్వాత.. పెళ్లి సందడి సినిమాతో మరోసారి హీరోగా ఆడియన్స్‌ను పలకరించాడు.
ఇక ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకేంద్రుడిగా వ్యవహరించాడు. శ్రీలీల హీరోయిన్గా మెరిసింది. కాగా ఈ సినిమాలో వీరిద్దరి పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. మరోపక్క రోషన్‌కు హీరోగా మంచి అవకాశాలే దక్కాయి. అలా ప్రస్తుతం వృషభ అనే సినిమాలో నటిస్తున్నాడు రోషన్. ఈ సినిమాను తెలుగుతోపాటు.. మలయాళంలోను రూపొందిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్ కీలక పాత్రలో మెరవనున్నారు. అలాగే.. రోషన్ చేతిలో మరో తెలుగు ప్రాజెక్టు ఉండడం విశేషం. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలోను రోసన్ చాలా యాక్టివ్‌గా ఉంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు.