నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తాజా మూవీ కోర్ట్ ఎలాంటి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాకు తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఓ థియేటర్లో ప్రదర్శితమవుతున్న కోర్ట్ సినిమాను అధికారులు నిలిపివేశారు. ఆడుతున్న షోలు సగంలో ఆపివేయడంతో.. అప్పటివరకు సినిమా చూస్తున్న ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో తెలియక.. థియేటర్లో గందరగోళం నెలకొంది. అధికారులే సినిమాను ఆపివేయడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, అమలాపురం, వెంకటరమణ థియేటర్లో చోటుచేసుకుంది.
నాని ప్రొడ్యూసర్గ వ్యవహరించిన ఈ సినిమాలో ప్రియదర్శి కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు అధికారికంగా ప్రకటించిన టికెట్ రేట్ల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు అధికారులకు అందడంతో.. వెంటనే అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే వెంకటరమణ థియేటర్ ప్రదర్శనను ఆపేశారు అధికారులు. సినిమా టికెట్లు అధికంగా విక్రయిస్తున్న మరిన్ని థియేటర్ల పై అధికారులు దాడి చేపట్టారు. ఈ సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సినిమా టికెట్లు అధిక ధరలు అమ్ముతున్నారని వచ్చిన వార్తలు పై రెవిన్యూ అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఆర్డిఓ కే.మాధవి, ఎమ్మార్వో అశోక్ టికెట్ ధరలను పరిశీలించగా.. రూ.110కు విక్రయించాల్సిన కోర్ట్ టికెట్లను రూ.150కు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు ధియేటర్ లైసెన్స్ రెన్యువల్ కూడా కాలేదట. ఈ క్రమంలోనే విచారణ పూర్తయ్యే వరకు సినిమాను నిలిపివేయాలని కే.మాధవి ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా థియేటర్ కు సంబంధించిన రికార్డులను రెవిన్యూ అధికారులు వెంట తీసుకువెళ్లి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇదే టాపిక్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా అధిక ధరలతో టికెట్లు అమ్మితే ఎలాంటి ఫలితం ఉంటుందో అనే అంశంపై ఏపీతోపాటు.. సినీ పరిశ్రమలోను హాట్ టాపిక్ గా వార్తలు వైరల్ అవుతున్నాయి.