టాలీవుడ్ డేరింగ్ అండ్.. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పోకిరి ,ఇడియట్, టెంపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన డైరెక్టర్ పూరి జగన్నాథ్.. రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు రావడంతో డీల పడిపోయాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ ఎవరు పూరి జగన్నాథ్ సినిమా చేస్తే అవకాశం లేదని.. అసలు సిద్ధంగా లేరు అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. పూరి స్టైల్ మ్యాజిక్ గాని.. హీరోల పాత్రలో డెప్త్ గాని ఏది కనపడలేదు అంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.
ఇటీవల కాలంలో పూరి మార్క్ సినిమా ఒక్కటి కూడా రాలేదంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పూరి కాంపౌండ్ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు రివీల్ అయింది. లైగర్, డబ్బులు ఇస్మార్ట్ సినిమాల భారీ డిజాస్టర్ల తర్వాత తర్వాత పూరి నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు ఊహించని హీరోతో సినిమాకు పూరి సిద్ధమవుతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఇటీవల ఆయనను కలిసిన పూరి జగన్నాథ్.. స్టోరీని వినిపించి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడట.
అంతేకాదు.. ఆయన చెప్పిన స్టోరీ సింగిల్ సిట్టింగ్‌లోనే విజయ్ సేతుపతి ఓకే చేసేసారని.. తను చేసే సినిమాల కథలన్నీ పక్కనపెట్టి కాల్‌షీట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అంటూ సమాచారం. ఇక విజయ్ సేతుపతితో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను పూరి జగన్నాథ్ ప్లాన్ చేశాడని.. సినీవర్గలలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. రెగ్యులర్ డ్రగ్స్ నేపథ్యంలో కాకుండా.. క్రైమ్ తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ తో అసలు ఊహించని కాంబోను పూరి ప్లాన్ చేశాడని.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కాయమంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.