” ఆదిత్య 369 ” రీ రిలీజ్ డేట్ లాక్.. బాలయ్య హిట్ హిస్టరీ రిపీట్ అంటున్న ప్రొడ్యూసర్..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించి ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆదిత్య 369. దాదాపు 37ఏళ్ళ‌ తర్వాత మరోసారి థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఏప్రిల్ 11న సినిమా గ్రాండ్‌గా రీ రిలీజ్ కానున్న‌ట్లు నిర్మాత శివలెంక‌ కృష్ణప్రసాద్ అఫీషియల్ గా ప్రకటించారు. సంగీతం శ్రీనివాస్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే.. ఆల్ టైం కాల్ట్‌ క్లాసికల్ సినిమాగా నిలిచిపోయింది. ఇక హీరోయిన్ మోహిని ఈ సినిమాల్లో బాలయ్య జంటగా మెరిసింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు ఆలపించారు. సమర్పకుడిగాను ఆయన వ్యవహరించడం విశేషం. 1991లో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్‌ సెంటర్‌గా నిలిచింది.

Aditya 369' to get a sequel, confirms Nandamuri Balakrishna

బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. ఏకంగా రెండు నంది అవార్డులను దక్కించుకుంది. ఇక తాజాగా ఈ రీ రిలీజ్‌ అఫీషియల్ గా ప్రకటించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక‌ కృష్ణప్రసాద్.. సినిమాను 4కెలో డిజిటలైజ్ చేసామని.. సౌండ్ కూడా 5.1 క్వాలిటీ కన్వర్ట్ చేసామంటూ చెప్పుకొచ్చాడు. ప్రసాద్ డిజిటల్ టీం ఆరు నెలల పాటు శ్రమించి అత్యున్నతమైన అవుట్‌పుట్ ఇచ్చారని.. 37 ఏళ్ళు క్రితం జూలై 18, 1991 లో రిలీజ్ అయిన ఈ సినిమా పై ఇప్పటికీ ఆడియన్స్‌లో అదే క్రేజ్ ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ గురించి చాలామంది అడిగారని.. అప్పట్లో ఇది చాలా అడ్వాన్స్డ్ మూవీ.. ఇక ఇప్పటి ట్రెండ్ కు పూర్తిగా కనెక్ట్ అయ్యే మూవీ అంటూ చెప్పుకొచ్చాడు.

Watch Aditya 369 | Prime Video

ఇక సినిమా గురించి, బాలయ్య నటన గురించి, డైరెక్టర్ ప్రతిభ గురించి ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు రీ కాల్ చేసిన‌ ప్రొడ్యూసర్.. 1991 లో ఈ సినిమా రిలీజ్ టైంలో నేను ఎంత ఎక్సైట్ అయ్యాను. ఇప్పుడు రీ రిలీజ్‌లోను అంతే ఎగ్జిట్ అవుతున్నానని వివరించాడు. ఇక నందమూరి అభిమానులే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఇది ఒక గొప్ప కానుక అంటూ చెప్పుకొచ్చిన కృష్ణప్రసాద్.. ఇప్పటివరకు నిర్మాతగా 15 సినిమాలు చేశా. ఎన్ని హిట్ సినిమాలు తీసిన.. నాకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది.. గుర్తింపుని ఇచ్చింది మాత్రం ఆదిత్య 369 సినిమానే. శ్రీదేవి మూవీస్ పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసిన సినిమా ఇది అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా మరోసారి ప్రేక్షక ఆదర‌ణపొంది.. బాలయ్య బాబు హిట్ హిస్టరీని రిపీట్ చేస్తుందని నమ్మకం నాకుంది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.