సినీ ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్న ఎంతోమంది నటీనటులు.. ఇతర హీరోలకు సంబంధించిన ఫేవరెట్ సినిమాల లిస్ట్ గురించి అడిగితే.. ఎక్కువగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న హిట్ సినిమాల పేర్లనే ఫేవరెట్ సినిమాలుగా చెప్తూ ఉంటారు. కానీ.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం వాళ్ళందరికీ పూర్తి భిన్నం. ఫ్యాన్స్‌కు నచ్చని సినిమాలు ఆయన హిట్ లిస్టులో నిలుస్తాయి. ముఖ్యంగా.. ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా ఆయన మోస్ట్ ఫేవరెట్ మూవీ అట. ఈ సినిమాలో రాంచరణ్ నటనను తెగ పొగిడేస్తూ ఉంటాడట చిరంజీవి.
ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు ఆరెంజ్. ఈ సినిమా అసలు మెగా ఫ్యాన్స్ కు కనెక్ట్ కాలేదు. పాటలు ఓ మాదిరిగా ఆకట్టుకున్న.. కథ జనాలకు బోర్ కొట్టేసింది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ టైంలో రామ్ చరణ్ విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ ఆరెంజ్ సినిమా టీవీలో వస్తే.. చరణ్ నటనపై ఎన్నో విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. కానీ.. ఈ సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంతగానో ఇష్టమట. సినిమాల్లో చరణ్ పెర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. ఆయన చరణ్ నటన పై ఎప్పటికప్పుడు ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు.
ఓ నటుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ సినిమాలో కనిపిస్తాయని.. ప్రతి సినిమాలో ఒకే విధంగా నటన చూపిస్తే అతను హీరో ఎలా అవుతాడని చిరంజీవి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటాడట. ఈ కారణంగానే చిరుకి.. చరణ్ నటించిన సినిమాలలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఆరెంజ్ అని తెలుస్తుంది. ఏమాత్రం ఫ్రీ టైం దొరికిన కచ్చితంగా చరణ్ ఆరెంజ్ సినిమాను చూస్తూ ఉంటాడట. ఇక చిరు ప్రస్తుతం.. విశ్వంభర సినిమాతో సమ్మర్ బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ట్యాలెంటెడ్ స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాను నటించనున్నాడు .ఈ సినిమాలో చిరు 30 ఏళ్ల కిందటి వింటేజ్ హీరోగా కనిపించబోతున్నాడట.