టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఇక ఈ సినిమాను దాదాపు అంతా చూసే ఉంటారు. ఇక ఇందులో బుల్లిరాజు పాత్ర ఎప్పటికీ ఆడియన్స్‌లో గుర్తు ఉండిపోతుంది. అంతలా ఈ బుడ్డోడు ఫేమస్ అయ్యాడు. అప్పటివరకు ఏ సినిమాలో నటించకున్నా.. మొదటి సినిమాలోనే తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు బుల్లి రాజు. ఇంతకి బుల్లి రాజు అసలు పేరు చెప్పలేదు కద తనే రేవంత్. ఇక తాజాగా రేవంత్‌కు సంబంధించిన ఓ ఇంట్స్టింగ్ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.
ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. ప్రస్తుతం ఐదో తరగతి చదువుకుంటున్నాడు. ఓ వీడియో వల్ల వైరల్ అవుతు అనిల్ రావిపూడి కంటికి ఈ బుల్లి రాజు చిక్కాడు. వెంటనే అనీల్ రేవంత్‌ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత హీరో వెంకటేష్ కంటే ఎక్కువ.. బుల్లి రాజు మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ చైల్డ్ ఆర్టిస్ట్ డిమాండ్ వేరే లెవెల్‌కు వెళ్ళింది.
ఇక సంక్రాంతికి వస్తున్నాం రిజల్ట్ తర్వాత.. చాలా చాలా కథలు రేవంత్ కోసం క్యూ కడుతున్నాయట. అదే టైంలో.. రోజుకి లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ బుల్లి రాజు డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు.. ఆ భారీ మొత్తంలో ఇచ్చేందుకు నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు టాక్. మరోవైపు అనిల్ రావిపూడి.. చిరంజీవితో తీయబోయే నెక్స్ట్ సినిమాలోని కచ్చితంగా రేవంత్ ఉంటాడనే రూమర్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతో వేచి చూడాలి.