పేరుకి స్టార్ హీరో.. కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ కు అదంటే చచ్చేంత భయమా..?

నందమూరి నటవారసుడిగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. బాలునటుడుగా తన సినీ కెరీర్ ప్రారంభించాడు. తర్వాత హీరోగా మారి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న తార‌క్ త‌న కెరీర్‌లో ఎలాంటి రోల్ లోనైనా అవలీలగా నటిస్తాడు. ఎంత పెద్ద డైలాగ్ నైనా కష్టం లేకుండా చెప్పేస్తాడు. పాత్రల్లో ఒదిగిపోయ్యే ఆయ‌న‌.. డ్యాన్స్ స్టెప్స్ కు ప్రాక్టీస్ అవసరం లేకుండా.. సింగల్ టేక్ లో చేస్తాడని ఇప్పటికే ఆయ‌న‌తో వ‌ర్క్ చేసిన కొరియోగ్రాఫర్స్ కూడా పలు సందర్భాల్లో వివరించారు. ఇలా తారక్ గురించి దాదాపు అందరూ పాజిటివ్‌లే చెబుతూ ఉంటారు.

Jr NTR is a fabulous dancer Choreographer Bosco Martis - India Today

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ స్టార్ హీరోగా రాణిస్తున్న తారక్‌కు.. ఇప్ప‌టికీ ఓ విషయం అంటే చాలా చాలా భయమని.. సినిమాలో అలాంటి సీన్స్ లో నటించాలంటే వణుకు పుట్టేస్తుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తారక్‌ మొదటి నుంచి మంచి టాకెటీవ్‌. ఎక్కువగా మాట్లాడుతూ.. ఫేస్ టు ఫేస్ ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తూ ఉంటాడు. కానీ.. అమ్మాయిల విషయంలో మాత్రం ఆయన కాస్త దూరంగా ఉంటాడట‌. అమ్మో అమ్మాయిల మైండ్ సెట్ అసలు అర్థం చేసుకోలేము అని అభిప్రాయంలో తారక్ ఉంటాడు. సాధారణంగా ఎన్టీఆర్.. ఆయనతో వర్క్ చేసే హీరోయిన్స్ తో ఎక్కువగా మింగిల్ కారు. సినిమా ఎంతవరకు అంతవరకు మాత్రమే మాట్లాడుతాడు.

Jr NTR, Janhvi Kapoor's Romance Steals The Spotlight In 'Dheere Dheere'  Song 'Devara: Part 1'

పర్సనల్గా ఇంటికి పిలిపించే వరకు ఆయన వెళ్లారు. ఇది దాదాపు ఇండస్ట్రీలో అందరికీ తెలిసే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి స్టెప్స్ అయినా ఎంత కష్టమైన సీన్స్‌ అయినా చేస్తాడేమో కానీ.. రొమాంటిక్‌గా నటించాలంటే మాత్రం తెగ భయపడిపోతాడట. ఇక.. షర్ట్ తీసి షాట్లో కనిపించాలంటే మహా మహా సిగ్గుపడిపోతూ ఉంటాడని.. షట్ లేకుండా అమ్మాయిలు ఉన్న సెట్స్ లో కనిపించడానికి కూడా అస్సలు ఒప్పుకోడని టాక్‌. చాలా భయపడిపోతాడని.. అంతకన్నా ఎక్కువగా సిగ్గు పడిపోతారని.. ఎంత కష్టమైనా క్యారెక్టర్ లో అయినా నటించే తారక్ రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు మాత్రం టేకులపై టేక్ లు తీసుకుంటారని తెలుస్తుందిన. ఈ క్రమంలోనే తను నటిస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటాడ‌ట‌.