పదేళ్ల తర్వాత ఆ హీరోయిన్‌ను వాడుతున్న బాలయ్య.. అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడైనా హిట్ వస్తుందా..?

ప్రస్తుతం నందమూరి నట‌సింహం బాలకృష్ణ వరుస స‌క్స‌స్‌ల‌తో మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. తాజాగా వచ్చిన డాకు మహారాజ్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు బాల‌య్య‌. ఇప్పటికీ సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఇక ప్రస్తుతం బాలయ్య తన బ్లాక్ బాస్టర్ అఖండకు కంటిన్యూషన్‌గా అఖండ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహా కుంభమేళాలో ఇటీవల ఈ సినిమా షూట్ మొదలైంది. ఇప్పుడు ఏపీలో సముద్ర షూటింగ్ కోసం లొకేషన్‌లో వేటలో ఉన్నారు టీం. త్వరలో బాలయ్య సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్గా కనిపించనుంది.

Pragya - News - IMDb

ఇక బాలయ్య లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. కాగా బాలయ్య ఈ సినిమా తర్వాత.. వీర సింహారెడ్డి లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. దీన్ని బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ 10న ప్రారంభించనున్న‌ట్లు టాక్. ఇక బాలయ్య‌ను పవర్‌ఫుల్ రోల్‌లో చూపించాలంటే బోయపాటి తర్వాత ఎవరైనా అంటుంటారు. కాగా.. వీర సింహారెడ్డి సినిమాలో ఆయనను మించిపోయే రేంజ్‌లో బాలయ్యను మాస్‌గా ఎలివేట్ చేశాడు గోపీచంద్. ఇప్పుడు మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానుంది.

Balakrishna, Trisha reunite for Gopichand Malineni's film?

ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారుతుంది. బాలయ్య స‌ర‌సన ఈ మూవీ హీరోయిన్గా త్రిష నటించబోతుందని సమాచారం. అంతే కాదు.. ఇందులో మరో హీరోయిన్‌ మాళవిక మోహన్ కనిపించనుంది. ఆమె ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే పదేళ్ల గ్యాప్ తర్వాత బాలయ్యతో జతకడుతుంది త్రిష. గతంలో లయన్ సినిమాలో ఇద్దరు కలిసి నటించినా అది పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే అప్పుడు ప్లాప్ ఇచ్చిన త్రిష ఇప్పటికైనా సక్సెస్ ఇస్తుందా.. లేదా.. అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.