వేణుస్వామి బిగ్ బాంబ్.. ఐటీ రైడ్స్ జస్ట్ ట్రైలర్.. సినిమా వేరే ఉందా..?

టాలీవుడ్ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులారిటీ దక్కించుకున్న వేణు స్వామి.. ఎప్పటికప్పుడు సెలబ్రెటీలపై సంచలన‌ కామెంట్స్ చేస్తూ వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే గతంలో చైతన్య, శోభిత‌ల‌ జాతకాల గురించి అలాగే.. అల్లు అర్జున్ జాతకం గురించి వివరించిన వేణు స్వామి.. శోభిత విషయంలో చేసిన కామెంట్స్‌ మహిళ కమిషన్ వరకు వెళ్లి.. పెద్ద వివాదాన్ని ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మాత్రం మానలేదు. వేణు స్వామి తాజాగా మరోసారి అల్లు అర్జున్, సుకుమార్ జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసుకున్నాడు.

Allu Arjun Issue: Venu Swamy Craving for Attention

కొద్దిరోజులుగా బన్నీ పుష్ప 2 సక్సెస్‌తో రికార్డులు సెట్ చేస్తూనే.. మరో పక్క వివాదాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సంగతి అంటూ వేణు స్వామి కామెంట్ చేశాడు. తన వీడియోలో మాట్లాడుతూ.. బన్నీ గురించి ఆయన చుట్టూ జరిగే కొన్ని విషయాల గురించి విశ్లేషించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ రైడ్‌కు సంబంధించి చాలామంది అడుగుతున్నారు. కాగా అల్లు అర్జున్ ది కన్యా రాశి, సుకుమార్‌ది కుంభరాశి.. వీళ్ళ జాతకాలు షాష్టాష్ట‌కం కాంబినేషన్. వీళ్ళ జాతకంలో శని స్థానం బట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అంటూ వెల్లడించాడు. ఈ రెండు జాతకాలు కలవడం వల్ల ఒక ఫైర్ లాగా బ్లాస్ట్ అవుతుందని.. దీనివల్ల చుట్టుపక్కన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అంటూ వెల్లడించాడు.

ఇక అల్లు అర్జున్ జాతకం ప్రకారం శని స్థానం ప్రకారం ఆయనకు వ‌త్రు స్థానం, రోగ స్థానం ఉన్నాయ‌ని వివ‌రించాడు. ఇక గత సంవత్సరం నుంచి బ‌న్నీ పై విపరీతమైన శత్రువుల దాడి జరుగుతునే ఉంది. ఇక బన్నీ జైలుకు వెళ్లడంతో మానసికంగా బాగా దెబ్బ తినడం చూస్తూనే ఉన్నాం. వీటితో పాటే సినిమాతో సంచలనం సృష్టించాడు. ఇక మార్చ్ 30, 2025 వ‌ర‌కు అల్లు అర్జున్, సుకుమార్‌ల‌కు శని కీలక స్థానంలో ఉండడం వల్ల పెను సంచలనం సమస్యలు వస్తాయని ఇవ‌రించాడు. అలానే మైత్రి మూవీస్, దేవిశ్రీప్రసాద్ ఎఫెక్ట్ అవుతున్నారు. మార్చి 30 తర్వాత ఇంకా పైకి ఎదుగుతారని వెల్లడించాడు. అలాగే ఉగాది నుంచి శని తులా రాశిలోకి వెళ్లడం వల్ల.. తెలుగు పరిశ్రమ, తెలుగు రాజకీయాలపై మరింత ప్ర‌భావం పడుతుందని.. ఇప్పటివరకు టాలీవుడ్‌లో జరిగిందంతా జస్ట్ సినిమా టైటిల్స్, ట్రైలర్ మాత్రమే.. అసలైన స్టోరీ ముందుంది. ఇలాంటివి మార్చి 30 నుంచి మరిన్ని చూడబోతున్నాం అంటూ బిగ్ బాంబు పేల్చాడు. ఇక వేణు స్వామి చెప్పిన ఆశలు సినిమా ఏంటో చూడాలంటే.. మార్చి 30 వరకు వేచి చూడాల్సిందే.