బాలయ్య మొదటి మల్టిస్టారర్ లోడింగ్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో పలు మల్టీ స్టార‌ర్ సినిమాలలో నటించి.. సోలో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అదే దిశగా ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బాస్టర్లతో దూసుకుపోతున్న బాలయ్య.. మొదటిసారి మల్టీ స్టార‌ర్ సినిమాకు సిద్ధమవుతున్నాడట. సౌత్‌లో రానున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో మల్టీస్టారర్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న రజనీకాంత్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. 74 ఏళ్ళ వయసులను తనదైన స్టైల్‌తో ఎనర్జీటిక్ పెర్ఫార్మన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న రజిని.. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో కూలి సినిమాలో నటిస్తున్నాడు.

Jailer (2023) - IMDb

ఈ సినిమా తర్వాత డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో రజనీకాంత్ జైల‌ర్ 2లోనటించ‌నున్నాడు. ప్రస్తుతం నెల్సన్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇక 2023లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న జైలర్.. ఏకంగా రూ.650 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది. దీంతో సినిమా సెకండ్ పార్ట్‌పై కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక జైలర్ ఫస్ట్ పార్ట్‌లో రజనీకాంత్ జంటగా రమ్యకృష్ణ కనిపించగా.. కొడుకు రోల్‌లో వసంత్‌ రవి.. అతనికి జంటగా మీర్నా నటించారు. మలయాళ నటుడు వినాయక విలన్ పాత్రలో కనిపించడు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీర్ ష్ర‌ఫ్ కీలకపాత్రలో గెస్ట్ రోల్స్‌లో సినిమాపై మరింత హైప్‌ తెచ్చిపెట్టారు.

Nelson Dilipkumar wanted Nandamuri Balakrishna to play a role in 'Jailer' | Tamil Movie News - Times of India

ఈ క్రమంలోనే ఫస్ట్ పార్ట్‌లో నటించిన వాళ్ళు రెండో భాగంలోను కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. కానీ.. క‌థ‌కు తగ్గట్టు కొంతమంది నటులను మార్చే అవకాశం ఉందట. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ రోల్స్‌కు ఎలాంటి ఆదరణ దక్కిందో తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్ గా మారింది. కాగా శివ రాజ్ కుమార్ గ‌త‌ రెండు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్లేస్ లో తెలుగు స్టార్ హీరో బాలయ్య‌ను నటింపజేయాలని నెల్సన్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రోజుల్లో నటించేందుకు బాలయ్య ఒప్పుకుంటే మాత్రం.. సినిమా పై అంచనాలు వేరే లెవెల్ కి వెళ్తాయి అనడంలో సందేహం లేదు.