స్టార్ హీరోయిన్ నిత్యమీనన్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు వరస సినిమాలో నటించి ఫుల్ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌లోను ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇటీవల ఈ అమ్మడి నేచురల్ నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్న నిత్య.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు.. ఆస్తులను కూడా అదే రేంజ్‌లో కూడబెట్టింది. అయితే తాజాగా రవి మోహన్‌తో కలిసి సినిమాలో నటించిన నిత్య.. సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేస్తుంది.
ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలో పాల్గొన నిత్య సినిమా విషయాలతో పాటు.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా పంచుకుంటుంది. ఇందులో భాగంగా తను చేసిన సెన్సేషనల్ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. నిత్య మీనన్ మాట్లాడుతూ.. సినిమా రంగం అంటే ఏమాత్రం ఇష్టం లేదంటూ బిగ్ బాంబ్ పేల్చింది. తనకు మరో రంగంలో అవకాశం వస్తే ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాను అంటూ నిత్యమీనన్ చేసిన కామెంట్స్ అందరికి షాక్‌ను కలిగిస్తున్నాయి. తనకు సెలబ్రెటీలా కాకుండా.. సాధారణ జీవితాన్ని గడపడం ఇష్టం అంటూ నిత్యమీనన్ వెల్లడించింది. తనకు ప్రయాణాలు చేయడం అంటే ఎక్కువగా నచ్చుతుందని.. అందుకే చిన్నప్పుడు పైలెట్ కావాలని కోరుకునేదానంటూ చెప్పుకొచ్చింది.
అయితే చివరకు హీరోయిన్గా మారానని.. ఓ నటిగా లైఫ్ను స్వేచ్ఛగా జీవించలేకపోతున్నానని వివరించింది. తనకు పార్కులో నడవడం అంటే చాలా ఇష్టమని.. ఇప్పుడు అలా చేయలేకపోతున్నా.. ఒక్కోసారి నాకు ఇదంతా అవసరమా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. నేషనల్ అవార్డు వచ్చే ముందు వరకు సినిమాలు వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని భావించానని.. కరెక్ట్ సమయానికి ఈ నేషనల్ అవార్డు వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిత్యమీనన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే నిత్యమైన ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతుంది. తమిళంలో వరస సినిమాలో నటిస్తుంది. చివరిగా కొలంబి మూవీలో నటించిన నిత్య.. ఇడ్లీ కడై, డియర్ ఎక్సెస్ సినిమాలతో పాటు.. వీజేయస్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక చివరిగా టాలీవుడ్‌లో భీమ్లా నాయక్ సినిమాలో కనిపించింది.