టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్యకు శుక్ర మహార్దశ నడుస్తుంది అంటున్నారు. ఇలాంటి క్రమంలో బాలయ్య నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా అఖండ 2. 2025లో రిలీజ్ కాబోయే మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకు.. షూటింగ్ తాజాగా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సినిమాను సెప్టెంబర్ 25న థియేటర్లలో తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా అఖండలో బాలయ్య అఘోర పాత్ర ఏ రేంజ్ లో హైలైట్ గా నిలిచిందో తెలిసిందే. ఈ క్రమంలోనే సీక్వెల్లో మరోసారి బాలయ్యను అఘోరలా పవర్ ఫుల్ పాత్రలో చూసేందుకు ఆసక్తి చెప్తున్నారు అభిమానులు. ఇలాంటి క్రమంలో బాలయ్య సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చే థమన్ అఖండ 2పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అనంతపురంలో జరిగిన డాకు మహరాజ్ సక్సెస్ మీట్‌లో థమన్ మాట్లాడుతూ.. సినిమా అదిరిపోతుంది సిద్ధంగా ఉండండి. అఖండ 2 పూర్తి పైసా వసూల్ సినిమా అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హఫ్, ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతాయని.. సెకండ్ హాఫ్ మాత్రం బోనస్ అంటూ చెప్పుకొచ్చాడు. బోయపాటి శీను డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మహాకుంభమేళలో తాజాగా ప్రారంభమైంది. బాలయ్య ఎంట్ర సీన్ కోసం బోయపాటి.. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ రూపొందించినట్లు సమాచారం. ఆ తర్వాత మూవీ టీం నందమూరి జిల్లాలోని గుడిమెట్ల గ్రామానికి వెళ్లి లొకేషన్ లను వెతకడం మొదలుపెట్టారు. అఖండ 2లో బాలకృష్ణ పాత్ర ద్వారా సామాజిక, రాజకీయ సమస్యలను చూపించే ప్లాన్ లో ఉన్నారట టీం.
మొదట సినిమాలోని ప్రధాన అంశాలను కొనసాగిస్తూనే.. సరికొత్త గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలను కూడా సినిమాలో జోడించనున్నట్లు తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్ మరోసారి ఈ సినిమాల్లో బాలయ్యతో కలిసి కనిపించనుంది. థమన్ ఈ సినిమాని.. బోయపాటి శ్రీను అద్భుతంగా డిజైన్ చేశాడని, పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తు.. సెకండ్ హాఫ్ బోనస్ అని చెప్పిన థమన్ కామెంట్స్ తో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ పక్కా. వరుసగా ఐదు హిట్స్ తో మరో రికార్డ్ బాలయ్య ఖాతాలో పడుతుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.