ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ దర్శకుడు అదృశ్యమైన ఘటన సంచలనగా మారింది. హైదరాబాద్ లోని మియాపూర్ లో డైరెక్టర్ అదృశ్యం అవడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. తెలుగు మూవీ డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46) అదృశ్యమయ్యారు. ఫ్రెండ్స్ కాలనీలో ఓం రమేష్ కృష్ణ నివాసం ఉంటుండగా.. నిన్న ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన కోసం సెర్చింగ్‌లు మొదలుపెట్టారు.
ఎక్కడ ఆయన ఆచూకీ లభించకపోవడంతో.. ఆయన భార్య శ్రీదేవి మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. తన భర్త కనిపించడం లేదని.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో ఆయనతో కలిసి పనిచేసిన స్టాఫ్‌తో పాటు, స్నేహితులను, సన్నిహితులను విచారిస్తున్నారు పోలీసులు. కావాలనే రమేష్ ఎక్కడికైనా వెళ్లిపోయారా.. లేదంటే ఎవరైనా కావాలనే కుట్ర చేసి ఆయనను మాయం చేశారా.. ఏం జరిగి ఉంటుందని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.
ప్రస్తుతం ఇలా టాలీవుడ్ డైరెక్టర్ మిస్సింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారడం.. మరోపక్క టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు, స్టార్ హీరో అరెస్ట్, ఇలాంటి వరుస షాకింగ్ సంఘటనలు జరుగుతున్న క్రమంలో.. టాలీవుడ్‌కు ఏదో దిష్టి తగిలిందని.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటుకుంటున్న క్రమంలో.. ఇలా వరుసగా ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన వార్త వినిపిస్తూనే ఉందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిసన్స్.