ఫేక్ రికార్డులపై బాలయ్య అదిరిపోయే కౌంటర్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఎప్పుడు ఏం మాట్లాడినా డైరెక్ట్ గా కుండ బద్దలు కొట్టినట్లు పాయింట్ స్పష్టంగా వివరిస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతిలో డాకు మహరాజ్‌తో వచ్చి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ గా.. యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా, ఊర్వశి రౌతెల హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్. సినిమా హిట్ అవ్వడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. సూపర్ హిట్ అయినా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని అనంతపురంలో తాజాగా నిర్వహించారు.

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ప్లాన్ చేయగా.. ఆ సమయంలో జరిగిన‌ సంఘటన కారణంగా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్న మేకర్స్.. సక్సెస్ సెలబ్రేషన్స్‌ను అక్కడే నిర్వహించారు. ఈ క్రమంలోనే బాలయ్య ఎనర్జీటిక్ స్పీచ్.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. డాకు మహారాజ్‌ మొదలైన నాటి నుంచి రిలీజ్ వరకు తనతో పాటు సినిమాకు కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావిస్తూ.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే రికార్డుల గురించి బాలయ్య కౌంటర్ వేశాడు. నావి అన్ని ఓర్జినల్ రికార్డులన్నీ వెల్లడించాడు బాలయ్య. అంటే ఇటీవల పోస్టర్స్ పై ఫేక్ కలెక్షన్, నెంబర్స్ అనేది కామన్ గా మారిపోయాయి. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిన వాటికి సంబంధం లేకుండా కలెక్షన్ పోస్టర్స్ వచ్చేస్తున్నాయి.

Nandamuri Balakrishna Speech at Daaku Maharaaj Grand Success Meet | TFPC

వాటిపై నిర్మాతలు బ‌య‌ట ప‌డ‌కున్నా.. అదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెబుతున్న కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకోవడానికి అలా చేస్తూ చేస్తున్నారు. అయితే బాలయ్య మాత్రం తన రికార్డ్ లన్ని ఒరిజినల్ అని స్పెషల్ గా మెన్షన్ చేస్తే చెప్పుకొచ్చాడు. ఫేక్ కలెక్షన్స్, ఫేక్ రికార్డులపై బాలయ్య మార్క్ కైంటర్‌గా ఆయన కామెంట్ ను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. డాకు మహ‌రాజ్‌ సక్సెస్‌తో బాలయ్య ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తన కొనఊపిరి వరకు సినిమాల్లో నటిస్తానని ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే సినిమాల్లో చేస్తానని వెల్లడించాడు. ఇక డాకు మహారాజ్ తర్వాత బాలయ్య అఅఖండ2 తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మరో సినిమా ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే బాలయ్య టార్గెట్ కూడా భారీగా ఉందనడంలో అతిశయోక్తి లేదు.