నిన్నటి నుంచి టాలీవుడ్ స్టార్ ప్రముఖుల ఎల్లప్ప పై ఇన్కమ్ టాక్స్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత దిల్‌రాజు ఇంటిపై కూడా ఊటీ దాడులు జరిగాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల విషయంలో ఆరాలు తీశారని.. సరైన లెక్కలు చూపించలేదని.. అందుకే వివరాల కోసం ఐటీ సోదాలు నిర్వర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరి ఆ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి మీద మాత్రం ఐటీ రైడ్స్ ఎందుకు జరగలేదు.. అనే ప్రశ్నలకు తాజాగా అనీల్ రావిపూడి రియాక్ట్ అయ్యారు. పటాస్ నుంచి 10 ఏళ్లలో 8 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ కలెక్షన్స్ చూసి షాక్ అయ్యా.
ఈ సినిమా తీసింది నేనేనా.. అనే అనుమానం కూడా అప్పుడప్పుడు నాకు వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పదేళ్లలో మీరు ఏం సంపాదించారు.. అనే ప్రశ్నకు ఆయన రియాక్ట్ అవుతూ.. నేను ఒక్కో సినిమాకు అభిమానుల్ని సంపాదించుకుంటూ పోతున్న. ఇప్పటివరకు మిలియన్‌కు పైగా ప్రేక్షకులలో నిలిచిపోయే ప్రేమను సంపాదించుకున్న అంటూ తెలివిగా రియాక్ట్ అయ్యాడు. ఐటి దాడుల గురించి ప్రస్తావన రాగానే నాపై దాడి చేస్తే వాళ్లకు పెద్దగా ఉపయోగమే ఉన్నదంటూ చెప్పుకొచ్చాడు. నాకే ఎదురిచి వెళ్తారేమో అంటూ కామెడీ చేశాడు. అసలే రైటర్ కమ్ దర్శకుడు కనుక.. చాలా తెలివిగా సమాధానం చెప్పాడు అనిల్ రావిపూడి.
ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ సాధారణంగా ఉంటుందని అనుకున్నాం. కానీ.. రోజురోజుకు ఆదరణ చూస్తుంటే నమ్మలేని నిజంల కనిపిస్తుంది. ఒకప్పుడు ఫలానా హీరో సినిమాకు ఊళ్ళల్లో ఎడ్ల బండ్లు కట్టుకొని, ట్రాక్టర్లతో ఫ్యామిలీలను తీసుకువచ్చి సినిమాలు చూసే వాళ్ళని విన్నాం. ఇప్పుడు కాలం మారి.. కాస్త వాహనాలు మారాయి. ఇక అంతకుమించి.. కుటుంబాలు తమ పిల్లలతో థియేటర్లకు వచ్చేస్తున్నారు. ఈ విషయంలో ఇది నా పదేళ్ల కెరీర్‌కు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్న అంటూ అనిల్ రావిపూడి వివరించాడు. ఆయన పటాస్ సినిమాతో దర్శకుడుగా కెరీర్ ప్రారంభించి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి.