టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు.. ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి చిన్న సెలబ్రిటీల వరకు రాజమౌళి సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. సెలబ్రిటీలు సైతం.. రాజమౌళి సినిమాల్లో చిన్న రోల్ వచ్చినా నటించేందుకు ఆరాటపడుతుంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ పలు ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇక అలాంటి రాజమౌళికి నచ్చిన హీరో, హీరోయిన్లు, యాక్టర్లు ఎవరు తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు ఆయనకు నచ్చిన రెండు ఫేవరెట్ సాంగ్స్ గురించి ఓ షార్ట్ వైరల్ గా మారుతుంది.
గతంలో రాజమౌళి తనకు ఆ రెండు పాటలు అంటే చాలా ఇష్టమని.. కేవలం హీరోయిన్ డ్యాన్స్ కోసమే చాలాసార్లు చూశాను అంటూ గతంలో ఓ సందర్భంలో వెల్లడించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారుతుంది. కాగా ఈ వీడియో ప్రభాస్ సలార్ సినిమా టైంలోది. సలార్ మూవీ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్‌లను జక్కన్న ఇంటర్వ్యూ చేశాడు. ఆ టైంలో తాను మెచ్చిన రెండు సాంగ్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్న జక్కన్న.. నా ఫోన్లో కానీ, టీవీలో కానీ.. నేను ఎక్కువగా చూసిన రెండు సాంగ్స్ శృతిహాసన్‌వే అంటూ చెప్పుకొచ్చాడు. రేసుగుర్రం సినిమా నుంచి డౌన్ డౌన్ డప్ప (పార్టీ సాంగ్) ఒకటి.. మరొకటి శ్రీమంతుడు మూవీలో చారుశీల.. ఈ రెండు సాంగ్స్ ఇప్పటివరకు నేను అత్యధికంగా చూసిన పాటలని.. ఐ జస్ట్ లవ్ హార్ డ్యాన్స్ అంటూ శృతిహాసన్ డ్యాన్స్ గురించి చెప్పుకొచ్చాడు.
ఆ రెండు సాంగ్స్ నేను మళ్ళీ.. మళ్ళీ.. చూసానని రాజమౌళి ఎంతో ఇష్టంగా వెల్లడించారు. ఇక ప్రశాంత్ నీల్‌తో మాట్లాడుతూ ఇందాక బయట కారిడార్ లో మీరు చెప్పారు. సినిమాలో ఎలాంటి డ్యూయెట్ సాంగ్ లేదని.. అది నన్ను చాలా నిరాశపరిచింది అంటూ నవ్వుతూ వెల్లడించాడు. దీన్నిబట్టే జక్కన్నకు.. శృతిహాసన్ డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పేసాడు. ఇక రాజమౌళికి నచ్చిన ఈ రెండు సినిమాలలో ఒకటి అల్లు అర్జున్ సినిమాలోది కాగా.. మరొకటి మహేష్ బాబు సినిమాలోది. ఇక ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా స్టోరీ చాలా పగడ్బందీగా రాస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎస్ఎస్ఎంబి 29 మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు తాజాగా హైదరాబాద్‌కు ప్రియాంక చోప్రా రావడంతో.. ఆ సినిమా కోసమే అంటూ ఊహాగానాలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.