టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లుగా తమకంటూ ఓ మంచి ఇమేజ్ సంపాదించుకుని రాణించిన వారు చాలామంది ఉంటారు. అలాంటి వారిలో డి. రామానాయుడు ఒకరు. ఆయన చేసిన సినిమాలే కాదు.. వ్యక్తిత్వం పరంగాను ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ఈ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రొడ్యూసర్ అనగానే టక్కున దిల్ రాజు పేరు వినిపిస్తుంది. దిల్ రాజు కూడా ప్రొడ్యూసర్ గా మంచి సినిమాలను తెరకెక్కిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ సాధిస్తున్నారు. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఆ సినిమా స్టార్ట్ అవ్వాలంటే ప్రొడ్యూసర్ కీలకం. అతను డబ్బు బయటకు తీస్తేనే సినిమా ముందుకు వెళుతుంది.
లేదంటే సినిమాకు చెక్ పడినట్లే. అలా ఇప్పటికే మధ్యలో స్టార్ హీరోల సినిమాలు ఆగిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటిది ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో ఏకంగా 50కి పైగా సినిమాలకు ప్రొడ్యూస్ చేసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు దిల్ రాజు. ఇక దిల్ రాజు సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేయవచ్చు అనే విధంగా మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం జనరేషన్‌లో దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ తెలుగు ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. కాగా దిల్ రాజు కెరీర్‌లో కొన్ని భారీగా డిజాస్టర్లు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆయన కెరియర్ లో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లో భారీ నష్టాన్ని కలిగించిన సినిమా మాత్రం గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి.
భారీ బడ్జెట్ తో రూపొంది.. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా.. రిలీజ్‌కు ముందు వరకు భారీ అంచనాలను నెలకొల్పింది. ఇలాంటి నేపథ్యంలో సినిమాకు ఫస్ట్ డే, ఫస్ట్ షోతోనే డివైడ్ టాక్ రావడంతో.. సినిమాపై ఆడియన్స్ లో మెల్లగా మెల్లగా ఆసక్తి తగ్గింది. తద్వారా సినిమా భారీ కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. దాదాపు రూ.500 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి రూపొందిస్తే.. కనీసం రూ.300 కోట్లకు కూడా సినిమా రీచ్ కాకపోవడంతో.. దిల్ రాజు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నాడు. అయితే ఇదే ఏడాది సంక్రాంతి బరిలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దిల్ రాజు సక్సెస్ అందుకున్ని.. కాస్త మేరా రికవరీ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నా.. గేమ్ ఛేంజర్ మిగిల్చిన నష్టం మాత్రం పూర్తిగా రికవరీ అవ్వడం అసాధ్యం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ.. గేమ్ ఛేంజర్ విషయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దెబ్బ అయిపోయాడంటూ సినీ మేధావులు సైతం కామెంట్లు చేస్తుండడం విశేషం.