టైటిల్: గాంధీ తాత చెట్టు
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్
నటీనటులు: సుకృతి వేణి(సుకుమార్ కూతురు), ఆనంద్ చక్రపాణి, రఘురాం, భాను ప్రకాష్ నేహాల్, ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్
సినిమాటోగ్రఫీ: శ్రీ జిత్ చెర్వపల్లి, విశ్వ దేవబత్తుల
మ్యూజిక్: రీ
నిర్మాతలు : నవీన్ యార్నేని ఎలమంచిలి రవిశంకర్ శేష సింధురావు
దర్శకత్వం: పద్మావతి మల్లాది
సెన్సార్ రిపోర్ట్ : U/A
రన్ టైం: 114 నిమిషాలు
రిలీజ్ డేట్: 24, జనవరి, 2025
పరిచయం:
స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ గాంధీతాత చెట్టు. ఇప్పటికే ఈ సినిమా పలు నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడి ఎన్నో అవార్డులను దక్కించుకుంది ఉత్తమ బాలనటిగా సుకృతి వేణికి ఎన్నో పురస్కారాలు దక్కాయి ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది విశేషమైన ఆదరణ పొందింది సినిమా ప్రమోషన్స్ లోనూ సుకుమార్ పాల్గొని సందడి చేశాడు సినిమాపై క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు మంచి అంచనాల మధ్య రేపు ఆడియోస్ ముందుకు రిలీజ్ కాడ ఉంది ఈ క్రమంలోనే సినిమా స్పెషల్ షో కొన్ని చోట్ల ప్రదర్శించారు మరి ఈ సినిమా ఎలా ఉంది సుకుమార్ కూతురు కృతి డబ్ల్యూ తో హిట్ కొట్టిందా లేదా ఒకసారి విశ్లేషణలో చూద్దాం
కథ:
నిజామాబాద్ ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తండ్రి నుంచి వచ్చిన ఆ భూమితో పాటే అక్కడ ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే రామచంద్రయ్యకు ప్రాణం. ఇక రామచంద్రయ్య మనవరాలు గాంధీ(సుకృతి వేణి)కి తాత అంటే చాలా ఇష్టం. గాంధీ తాత కథలను విని ఆయన మార్గంలోని నడిచేది. ఇక ఆ ప్రాంతంలో స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా చెరుకు ఫ్యాక్టరీ మూతపడుతుంది. చెరుకు పంట వేసిన రైతులంతా విపరీతంగా నష్టపోతారు. సమయానికి ఆ ఊర్లో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించి.. ఉపాధి కల్పిస్తానంటూ సతీష్ (రాగ్ మయుర్) రైతులను మభ్యపెట్టి ఎక్కువ డబ్బులు ఆశ చూపించి పంట పొలాలను కొనేస్తాడు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తన ప్రాణంగా పెంచుకుంటున్న వేప చెట్టు తొలిగిపోతుందని ఉద్దేశంతో పొలాన్ని అమ్మడానికి ఇష్టపడడు. కొడుకు స్థలం అమ్మేద్దామని తండ్రితో గొడవ పెట్టుకుంటాడు. చెట్టును నరికేస్తారని దిగులతో రామచంద్రయ్య చనిపోతాడు. ఇక తాత ఇష్టపడిన చెట్టును ఎలాగైనా రక్షించుకోవాలని గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం.. గాంధీ తాత మార్గంలోనే వెళుతూ గాంధీ ఊరిని.. చెట్టును.. ఎలా కాపాడింది అనేది అసలు కథ.
TJవిశ్లేషణ & డైరెక్షన్ :
గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ 13 ఏళ్ల అమ్మాయి తన పుట్టిన ఊరు, చెట్టుని కాపాడుకోవడానికి చేసిన పోరాటాన్ని సినిమా కథగా తీర్చిదిద్దారు. టైటిల్‌కు తగ్గట్టుగానే గాంధీ, తాత, చెట్టు పాత్రలు చుట్టూనే కథ తిరుగుతుంది. డైరెక్టర్ పద్మావతి ఎంచుకున్న పాయింట్ అద్భుతంగా ఉంది. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని చాలా క్లియర్ గా చూపించింది. సందేశం బాగున్న అక్కడక్కడ సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. మొక్కల ప్రాముఖ్యత వెల్లడిస్తూనే.. అహింసావాదాన్ని ఎంటర్టైనింగ్ తెరకెక్కించారు. చెట్టును రక్షించేందుకు గాంధీ చేసే ప్రయత్నాలు అందరిని మెప్పిస్తాయి. కానీ.. కథ వాస్తవానికి దూరంగా అనిపించింది. ఎలాంటి సాగదీతా లేకుండా సినిమా ప్రారంభంలోనే తాత, గాంధీ పాత్రలను పరిచయం చేసి వెంటనే కథ మొదలెట్టింది. డైరెక్టర్ ఓ పక్క గాంధీ పోరాటంతో పాటు.. మరోపక్క తాత రామచంద్రయ్య, చెట్టు మధ్య ఉన్న అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.
మహాత్మ గాంధీని ఈ కథలో ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంది. తాత చనిపోయినప్పుడు చెట్టు ఏడుస్తూ చెప్పే మాటలు విని సినిమా చూసే ఆడియన్స్ ఎమోషనల్ అవుతారు. ఫస్ట్ హఫ్ ఎంటర్టైన్ చేసినా.. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. అయితే సినిమాకు అతిపెద్ద మైనస్ కథలో ఎలాంటి ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా సాఫీగా సాగిపోవడం. నువ్వు ఒక మొక్క అయినా నాటావా.. చెట్టును నరికే హక్కు ఎవరు ఇచ్చారు.. నువ్వు పీల్చుకున్న గాలి.. ఎవరో పెంచిన మొక్కల నుంచి వచ్చింది. కానీ నువ్వు సంపాదించుకున్నది ఏమీ లేదంటూ బిజినెస్ మాన్ తో తాత చెప్పే డైలాగ్ చాలామందికి కనెక్ట్ అవుతుంది. నిజమే కదా మనం ఎప్పుడు ఒక చెట్టును కూడా పెంచలేదు అనే ఫీల్ చాలామందికి వస్తుంది. ఇక ఏదైనా ప్రేమతో గెలవాలంటే కాస్త సమయం పడుతుంది.. చెడును దులిపేయాలి, మంచిని పట్టుకోవాలి.. పంట పండే చేనుని అమ్ముకోవడం అంటే కన్నతల్లిని వ్యభిచారానికి పంపినట్టే అంటూ తాత చెప్తే డైలాగ్స్ అందరినీ ఆలోచింపచేస్తాయి. ఇక సినిమా సందేశం మాత్రం అందరిని ఆకట్టుకుంది.
నటీనటుల పెర్పామెన్స్ :
ఇక సుకుమార్ కూతురు సుకృతి తన మొదటి సినిమాతోనే తనదైన నటనతో ఆకట్టుకుంది. గాంధీ పాత్రలో జీవించేసింది. ఈ పాత్ర కోసం నిజంగానే ఆమె గుండు గీయించుకుంది అంటే ఎంత ఇష్టపడి పాత్రలో నటించిన అర్థమవుతుంది. ఎమోషనల్ సీన్స్ లో చక్కగా మెప్పించింది. తాత రామచంద్రయ్యగా.. ఆనంద్ చక్రపాణి 100% న్యాయం చేశాడు. రాగ్ మయూర్ బిజినెస్ మాన్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. గాంధీ తండ్రితో పాటు, చాలామంది నటీనటులు కొత్తవాళ్లయినా వాళ్ళ పాత్రల పరిధిలో మెప్పించారు.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే :
సాంకేతికంగా సినిమా యావరేజ్ అనిపించుకున్న.. రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ యావరేజ్. ఇక ఎడిటర్ సినిమాను మరికాస్తా ట్రిమ్ చేయాల్సిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఇంకాస్త క్రిస్పీగా కట్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ ( + ) :
రామచంద్రయ్య రోల్ ఆ పాత్ర చెప్పే డైలాగ్స్.. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హఫ్ ఎంటర్టైన్ చేస్తుంది. సినిమా మొత్తంలో సందేశం అందరిని ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ ( – ) :
కథ వాస్తవానికి దూరంగా అనిపించింది.
సినిమాకు అతిపెద్ద మైనస్ కథలో ఎలాంటి ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా సాఫీగా సాగిపోవడం.