స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి తనయురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట బాలీవుడ్‌లో సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది. తర్వాత దేవర సినిమాలో అవకాశాన్ని కొట్టేసి పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమ్మడి నటన, డ్యాన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ క్రమంలోనే చరణ్ ఆర్సి 16 సినిమాలోను అవకాశాన్ని కొట్టేసింది.
అలా ప్రస్తుతం నార్త్‌లోను, సౌత్‌లోను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూనే ఉంటుంది. ఈ పిక్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే అమ్మడు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. కాగా.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్సి 16 సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా పెళ్లి, పిల్లలకు సంబంధించిన విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. బాలీవుడ్‌లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వి కపూర్ పెళ్లిపై రియాక్ట్ అవుతూ ఇలా వెల్లడించింది. పెళ్లి చేసుకుని తన భర్తతో తిరుమల నగరంలో సెటిల్ అవ్వాలని ఉందని.. ముగ్గురు పిల్లల్ని కనాలనుకుంటున్నా.. అటుపై అరిటాకులో భోజనం పెట్టుకుని గోవింద నామస్మరణతో ఆ భోజనం చేయాలని తన కోరిక అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తన భర్తను లుంగీ వేసుకోమని తాను ఎప్పుడూ చెబుతానని జాన్వి వెల్లడించింది. ఇలా తన పెళ్లి, పిల్లల, జీవితం పై జాన్వి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.