భర్తతో విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. క్లారిటీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, రెండో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కామన్. ఇటీవల కాలంలో అలా ప్రేమించి వివాహం చేసుకున్న ఎనో జంటలు విడాకులు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న కారణాలతో కూడా ఎంతోమంది విడాకులు తీసుకుని రెండో పెళ్ళి చేసుకుంటున్నారు. అయితే డివోర్స్‌పై కొందరు అఫీషియల్‌గా ప్రకటిస్తుంటే.. మరికొందరు మాత్రం విడాకుల విషయాన్ని గోప్యంగానే ఉంచి ఇన్ డైరెక్ట్ హింట్లు ఇస్తూ ఫ్యాన్స్‌కు అనుమానాలు కలిగిస్తున్నారు. వాటిలో సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలు, భర్తలతో కలిసి దిగిన మెమొరబుల్ ఫోటోలను తొలగించడం కూడా ఒకటి.

ఆ తర్వాత మెల్లగా విడాకులను ప్రకటించి అందరికి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ విషయంలోనూ ఇదే సంఘటన చోటుచేసుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లోను భర్తతో కలిసి దిగిన ఫోటోలు, పెళ్లి ఫోటోలు అన్నింటిని డిలీట్ చేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె మరెవరో కాదు కలర్స్ స్వాతి. అష్టా చమ్మా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. స్వామి రారా, కార్తికేయ, గోల్కొండ హై స్కూల్ లాంటి సినిమాలతో మంచి పాపులారిటి దక్కించుకుంది. తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళం లోను ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో కేరళకు చెందిన ” వికాస్ వాసు “ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన స్వాతి.. మళ్లీ 2023లో మంత్ ఆఫ్ మధు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లోను ఆమె విడాకుల గురించి ప్రశ్నించగా.. చెప్పనంటూ తేల్చి చెప్పింది. కాగా ఇప్పుడు ఏకంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేసేసింది కలర్స్ స్వాతి. దీంతో స్వాతి విడాకుల పై క్లారిటీ ఇచ్చేసిందని.. వీళ్ళిద్దరూ విడిపోతున్నారని.. డైరెక్ట్‌గానే హింట్ ఇచ్చింది అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె విడాకులు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో అమ్మడు విడాకుల వార్త‌ల‌పై ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.